Thursday, March 12, 2026
Homeటెక్నాలజీFebruary 2026 smartphones: ఫిబ్రవరి 2026 ధమాకా.. భారత్‌లో లాంచ్ అవుతున్న టాప్ 7 పవర్‌ఫుల్...

February 2026 smartphones: ఫిబ్రవరి 2026 ధమాకా.. భారత్‌లో లాంచ్ అవుతున్న టాప్ 7 పవర్‌ఫుల్ 5జి ఫోన్లు

5g phone launches: ఫిబ్రవరి 2026 భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్‌కు చాలా కీలకమైన నెలగా మారుతోంది. మొత్తం 7 పెద్ద ఫోన్ లాంచ్‌లు ఈ నెలలో జరగబోతున్నాయి. జనవరిలో మిడ్ రేంజ్ ఫోన్‌లు ఎక్కువగా వచ్చిన తర్వాత, ఫిబ్రవరిలో ఫ్లాగ్‌షిప్ నుంచి బడ్జెట్ వరకూ అన్ని సెగ్మెంట్‌ల్లో కొత్త మోడల్స్ రంగంలోకి దిగుతున్నాయి. Samsung, Google, Vivo, Oppo, iQOO, Tecno వంటి బ్రాండ్లు ఈ నెలలో తమ కొత్త ఫోన్‌లను విడుదల చేయబోతున్నాయి.

- Advertisement -

ఫిబ్రవరి 9న సామ్‌సంగ్ నుంచి గెలాక్సీ ఎఫ్70ఈ 5జి

ఫిబ్రవరి 9న సామ్‌సంగ్ నుంచి గెలాక్సీ ఎఫ్70ఈ 5జి లాంచ్ అవుతోంది. ఇది మిడ్ రేంజ్ యూజర్లను టార్గెట్ చేస్తోంది. 120హెర్ట్జ్ డిస్‌ప్లే, 800 నిట్స్ బ్రైట్‌నెస్, 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్ ఇందులో ఉన్నాయి. 6000ఎంఏహెచ్ బ్యాటరీతో రోజంతా బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది. ధర 17,000 రూపాయల లోపే ఉండే అవకాశం కనిపిస్తోంది.

ఫిబ్రవరి 10న ఓప్పో కె14ఎక్స్ 5జి

ఫిబ్రవరి 10న ఓప్పో కె14ఎక్స్ 5జి మార్కెట్‌లోకి వస్తోంది. ఇందులో 6.75 అంగుళాల 120హెర్ట్జ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్, 50ఎంపీ రియర్ కెమెరా ఉన్నాయి. 6500ఎంఏహెచ్ బ్యాటరీకి 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నారు. పెద్ద బ్యాటరీ కోరుకునే వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్‌గా నిలవొచ్చు.

ఫిబ్రవరి 13న టెక్నో పోవా కర్వ్ 2 5జి

ఫిబ్రవరి 13న టెక్నో పోవా కర్వ్ 2 5జి లాంచ్ అవుతోంది. కొత్త స్పేస్ 2.0 డిజైన్‌తో పాటు రీడిజైన్ చేసిన కెమెరా ఐలాండ్ ఇందులో ప్రధాన ఆకర్షణ. మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్, 12జీబీ ర్యామ్ వరకు ఆప్షన్, ఆండ్రాయిడ్ 16 సపోర్ట్ ఉండొచ్చని లీక్స్ చెబుతున్నాయి. బ్లాక్, సిల్వర్, వైలెట్ కలర్‌ల్లో అందుబాటులోకి రానుంది.

ఫిబ్రవరి 18న గూగుల్ పిక్సెల్ 10ఏ

ఫిబ్రవరి 18న గూగుల్ పిక్సెల్ 10ఏ లాంచ్ కానుంది. ఇది పిక్సెల్ ఏ సిరీస్‌లో కొత్త మోడల్. పాత డిజైన్ స్టైల్ కొనసాగిస్తూ హారిజాంటల్ కెమెరా బార్‌తో వస్తోంది. టెన్సర్ జీ5 ప్రాసెసర్ ఇందులో ఉండే ఛాన్స్ ఉంది. ఫోటోగ్రఫీ మెరుగుదలలు, జెమినీ ఇంటిగ్రేషన్, డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ పెరిగిన బాడీ ఈ ఫోన్ హైలైట్స్‌గా గూగుల్ చెబుతోంది.

Read Also: 5G Smartphones: ఫోన్ కొనబోతున్నారా ఆగండి.. ఈ 3 పోన్లలో ఏది ‘బెస్ట్’ ఏది ‘వేస్ట్’ తేల్చేద్దాం రండి

ఫిబ్రవరి 19న వివో వీ70 సిరీస్

ఫిబ్రవరి 19న వివో వీ70 సిరీస్ విడుదల కానుంది. వీ70 ఎలైట్ మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్ వస్తుంది, సాధారణ వీ70 మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్ ఉంటుంది. రెండు ఫోన్‌ల్లో 6.59 అంగుళాల 1.5కే డిస్‌ప్లే, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ బ్రైట్‌నెస్ ఇవ్వబోతున్నారు. 6500ఎంఏహెచ్ బ్యాటరీకి 90వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. జైస్ ట్యూన్ చేసిన 50ఎంపీ కెమెరా సెటప్ కూడా ఇందులో భాగం.

ఫిబ్రవరి 24న ఐకూ 15ఆర్

ఫిబ్రవరి 24న ఐకూ 15ఆర్ లాంచ్ అవుతోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ ఉపయోగిస్తున్నారు. 7600ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ కేవలం 7.9ఎంఎం మందంతో స్లిమ్ డిజైన్ ఇస్తున్నామని కంపెనీ చెబుతోంది. 50000 రూపాయలలోపు సెగ్మెంట్‌లో ఇది ఫాస్టెస్ట్ ఫోన్ అని ఐకూ ప్రచారం చేస్తోంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా కూడా ఇందులో ఉంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్26 ఫిబ్రవరి 25న

ఫిబ్రవరి నెలలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న లాంచ్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్26 సిరీస్. ఫిబ్రవరి 25న విడుదల కావొచ్చని లీక్స్ చెబుతున్నాయి. ఈ సిరీస్‌లో గెలాక్సీ ఎస్26, ఎస్26 ప్లస్, ఎస్26 అల్ట్రా అనే మూడు మోడల్స్ ఉండే అవకాశం ఉంది. కెమెరా విభాగంలో పెద్ద అప్‌డేట్స్ రావొచ్చని సమాచారం. జూమ్ క్వాలిటీలో లైట్ వీడియో రికార్డింగ్ మరింత మెరుగవుతాయని టాక్. అల్ట్రా మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ ఉండొచ్చు, మిగతా రెండు మోడల్స్‌లో ఎక్సినోస్ 2600 ప్రాసెసర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి 2026 నెలలో భారత్‌లో బడ్జెట్ నుంచి ఫ్లాగ్‌షిప్ వరకూ అన్ని రేంజ్‌లలో కొత్త ఫోన్‌లు వస్తున్నాయి. కెమెరా, బ్యాటరీ, స్పీడ్, అప్‌డేటెడ్ లుక్ అన్నింటిలోనూ కంపెనీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ నెల చాలా కీలకంగా మారనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News