Saturday, November 15, 2025
Homeటెక్నాలజీFlipkart Big Diwali Sale: కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్ గుడ్ న్యూస్..‌ 'బిగ్‌ దీపావళి సేల్‌' పేరిట...

Flipkart Big Diwali Sale: కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్ గుడ్ న్యూస్..‌ ‘బిగ్‌ దీపావళి సేల్‌’ పేరిట ఆఫర్లు

Flipkart Big Diwali Sale | ప్రముఖ ఈ- కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్(Flipkart) మరో ఫెస్టివల్ సేల్‌కు సిద్ధమైంది. ఇటీవల దసరా పండుగను పురస్కరించుకుని ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ పేరిట భారీ ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ‘బిగ్‌ దీపావళి సేల్‌’ తేదీలను ప్రకటించింది. అక్టోబర్‌ 21 నుంచి ఈ సేల్‌ మొదలవుతుందని పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ లేదా వీఐపీ కస్టమర్లకు ఓరోజు ముందుగానే ఈ సేల్ మొదలవుతుందని తెలిపింది. దీపావళి సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై పెద్ద ఎత్తున ఆఫర్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

- Advertisement -

అలాగే ఎంపిక చేసిన క్రెడిట్\డెబిట్ కార్లడు ద్వారా కొనుగోలు చేసే వారికి అదనంగా 10శాతం డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు వివరించింది. ఈ సేల్‌లో అందిస్తున్న ఆఫర్లను తాజాగా కంపెనీ వెబ్‌సైట్‌లో బహిరంగపరిచింది. ఇందులో భాగంగా ఐఫోన్‌ 15(iPhone 15) రూ.49,999కే లభించనుంది. అలాగే పాత తరం యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ను రూ.9,999 కంటే తక్కువకే కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించనుంది. ఇక యాపిల్‌ మ్యాక్స్‌ బుక్‌ ఎయిర్‌ ఎం2పై రాయితీ అందిస్తున్నట్లు ప్రకటించింది.

అలాగే శాంసంగ్‌ గెలాక్సీ S23 రూ.37,999, గెలాక్సీ S3 FE రూ.29,249, ఐప్యాడ్‌ (2021) ధర రూ.20వేల కన్నా తక్కువకే కొనుగోలు చేయొచ్చని చెప్పుకొచ్చింది. ఆఫర్ల వివరాల కోసం ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలని తెలిపింది. అయితే మరిన్ని ఆఫర్ల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. దీంతో కస్టమర్లు ఈ సేల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు మరో ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ కూడా దీపావళి సేల్ ప్రకటించనుందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad