Flipkart Best Deal Offer: పండుగ సీజన్ రావడంతో ప్రముఖ ఈ–కామర్స్ ప్లాట్ఫార్మ్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వరుసగా ఆఫర్ల వర్షం కురిపించాయి. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌తో పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ ప్రకటించిన ఓ ఆఫర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఆఫర్ ప్రకారం, శామ్‌సంగ్ గెలాక్సీ S24 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే, మీకు శామ్‌సంగ్ నుండి 32-అంగుళాల స్మార్ట్ టీవీని ఉచితంగా గెలుచుకునే అవకాశం లభిస్తుంది. ఈ ఆఫర్ కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటాదని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24పై స్మార్ట్టీవీ ఫ్రీ..
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు కొత్త శాంసంగ్ ఫోన్ కొనుగోలు చేస్తే టీవీ కూడా ఇంటికి వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ S24 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే, మీకు శామ్‌సంగ్ నుండి 32-అంగుళాల స్మార్ట్ టీవీని ఉచితంగా గెలుచుకునే అవకాశం లభిస్తుంది. ఈ ఆఫర్ కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటాదని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ 32-అంగుళాల శామ్‌సంగ్ స్మార్ట్ టీవీ ధర రూ.17999గా ఉంది. శామ్‌సంగ్ గెలాక్సీ S24 5G స్నాప్డ్రాగెన్ ఫోన్ రూ. 74,999 ధర వద్ద ఉండగా.. దీన్ని మీరు ఆఫర్‌లో భాగంగా కేవలం రూ. 39,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. మీకు ఈ ఆఫర్‌లో 47 శాతం డిస్కౌంట్తో ఈ స్మార్ట్పోన్ లభిస్తుంది. అదనంగా దీనిపై రూ.1000 కూడా తగ్గింపు లభిస్తుంది. అంటే అన్ని ఆఫర్లు పోయి మీరు దీన్ని రూ. 38,999 కు కొనుగోలు చేయవచ్చు. మీ ఫోన్ పనితీరును బట్టి ఎక్స్ఛేంజ్ విలువ మారుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8 GB RAM, 128 GB మెమరీ, స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, 50 MP + 12 MP డ్యూయల్ రియర్ కెమెరా, 12 MP ఫ్రంట్ కెమెరా, 6.2 అంగుళాల AMOLED డిస్ప్లే, 4000 mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. భారతదేశంలో ఇది నంబర్ 1 అమ్ముడైన ఆండ్రాయిడ్ ఫోన్ అని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
పరిమిత కాలపు ఆఫర్ మాత్రమే..
మీరు 6 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ EMI ఆప్షన్ ద్వారా దీన్ని కొనుగోలు చేయవచ్చు. మీరు నెలకు రూ. 6667 చెల్లించడం ద్వారా దీన్ని పొందవచ్చు. సాధారణ EMI విషయానికి వస్తే.. మీరు 36 నెలల వరకు కాలపరిమితితో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇందుకోసం నెలకు రూ. 1400 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 24 నెలల కాలపరిమితి ఎంచుకుంటే, ప్రతినెలా రూ. 2000 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ, 18 నెలల ఈఎంఐ అయితే, మీరు నెలకు రూ. 2,500 చెల్లించాలి. మీరు మీకు నచ్చిన కాలపరిమితిని ఎంచుకోవచ్చు. ఈ ఆఫర్లు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయని గమనించాలి. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ ఆఫర్ను పట్టేయండి.


