Saturday, November 15, 2025
Homeటెక్నాలజీFlipkart Mobile Offers: ఫ్లిప్‌కార్ట్‌లో దిమ్మదిరిగే డిస్కౌంట్లు.. ఈ ఫోన్లపై ఆఫర్లు అస్సలు మిస్‌ కావొద్దు..!

Flipkart Mobile Offers: ఫ్లిప్‌కార్ట్‌లో దిమ్మదిరిగే డిస్కౌంట్లు.. ఈ ఫోన్లపై ఆఫర్లు అస్సలు మిస్‌ కావొద్దు..!

Flipkart Big Bang Diwali Sale: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ దివాళీ సేల్‌ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు, హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్‌లు ఇలా అన్ని ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ సేల్‌లో శామ్‌సంగ్‌, వివో, ఒప్పో, నథింగ్‌ వంటి అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లను సరసమైన ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే దసరా సేల్‌లో భారీ ఆఫర్లు ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్‌.. ఇప్పుడు దివాళీ సందర్భంగా బిగ్‌ బ్యాంగ్‌ దివాళీ సేల్‌తో ముందుకొచ్చింది. ఈ సేల్‌లో రూ.20 వేలలోపు స్మార్ట్‌ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు లభించే స్మార్ట్‌ఫోన్లపై ఓలుక్కేద్దాం.

- Advertisement -

వివో టీ T4ఎక్స్‌ 5జీ
వివో T4x 5Gలోని 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.17,999 ఉండగా.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ.13,499కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 6500mAh బ్యాటరీతో వస్తుంటది. 50 మెగాపిక్సెల్ మెయిన్‌ కెమెరాను కలిగి ఉంటుంది. డైమెన్సిటీ 7300 5G చిప్‌సెట్‌పై పనిచేస్తుంది.

రియల్‌మీ P3x 5G
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ రియల్‌మీ P3x 5G లోని 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.16,999 ఉండగా.. ఆఫర్‌లో భాగంగా దీన్ని కేవలం రూ.10,249 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 6.72 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది.

ఒప్పో K13x 5G
ఒప్పో K13x 5Gలోని 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.16,999 కాగా.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ.12,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది 6.67 అంగుళాల హెచ్‌డీ పస్ల్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 6000mAh బ్యాటరీకి మద్దతు ఇస్తుంది. ఇది 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో వస్తుంది.

శామ్‌సంగ్‌ గెలాక్సీ F36 5G
దిగ్గజ స్మార్ట్ఫోన్ కంపెనీ శామ్‌సంగ్‌ గెలాక్సీ F36 5Gలోని 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.22,999 ఉండగా.. ఇప్పుడు ఈ సేల్ సమయంలో రూ.13,999 వద్ద లభిస్తుంది. ఈ ఫోన్ Exynos 1380 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 6.7 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad