Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ తన అతిపెద్ద వార్షిక సేల్ బిగ్ బిలియన్ డేస్‌ను ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌ల నుండి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, గృహోపకరణాల పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంది. ఈ క్రమంలో ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై అందుబాటులో ఉన్న టాప్ డీల్స్ ఏమిటో తెలుసుకుందాం.
iPhone 16
ఆపిల్ తాజా ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబర్ 9న లాంచ్ అవుతుంది. ఈ క్రమంలో ఐఫోన్‌లో అత్యంత ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 16 పై భారీ డిస్కౌంట్ చూడొచ్చు. ఈ ఫోన్ రూ.70 వేలు లేదా రూ.60 వేల రూపాయల కంటే తక్కువ ధరకు ఆఫర్‌లతో అందుబాటులో ఉంటుంది.
Poco X7 Pro
మిడ్‌రేంజ్ విభాగంలో పోకో స్మార్ట్‌ఫోన్ బాగా ప్రాచుర్యం పొందింది. ఈ సేల్ సమయంలో దీని ధర రూ. 20,000 కంటే తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఇది రూ. 27,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది.
Also Read: SmartPhones: రూ.10 వేల లోపు లభించే టాప్ 5G స్మార్ట్ ఫోన్లు.. లిస్ట్ ఇదే..
Samsung Galaxy S24 FE
ఈ శాంసంగ్ ఫోన్ పోయిన ఏడాది రూ. 59,999 ధరకు పరిచయం అయింది. అయితే, ఈ సేల్ లో ఈ పరికరం రూ. 35,000 కంటే తక్కువ ధరకు రావచ్చు. ఈ పరికరం ప్రీమియం-ఎండ్ ప్రాసెసర్, శక్తివంతమైన కెమెరా సెటప్‌తో వస్తుంది.
Google Pixel 9 Series
గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఇటీవల లాంచ్ అయినా విషయం తెలిసిందే. దీని కారణంగా పిక్సెల్ 9 సిరీస్‌పై ప్రత్యేక తగ్గింపు అందుకోవచ్చు. ఈ లైనప్‌లోని అన్ని పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో XL ఫోన్‌లు అతి తక్కువ ధరకు లభిస్తాయి. దీంతోపాటు వీటిపై కార్డ్ డిస్కౌంట్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.
Samsung Galaxy S24
పోయిన ఏడాదిలో లాంచ్ అయినా ఈ పరికరాన్ని ఈ సేల్ సమయంలో రూ.40,000 కంటే తక్కువ ధరకు ఆర్డర్ చేయవచ్చు. దీని కారణంగా వినియోగదారులు గొప్ప విలువను పొందుతారు. అయితే, ఈ ఆఫర్ పరిమిత కాలం వరకు మాత్రమే ఉంటుంది.


