Big Billion Days Poco SmartPhones Deals: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సేల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో పోకో ఫోన్‌లపై అందుబాటులో ఉన్న డీల్స్ వెల్లడించింది. పోకో తన ఫెస్టివ్ మ్యాడ్‌నెస్ డీల్‌లను ప్రకటించింది. ఈ సేల్‌లో పోకో ప్రసిద్ధ మోడళ్లైన పోకో F7 5G, పోకో X7 ప్రో 5G, పోకో X7 5G, పోకో M7 సిరీస్‌లపై భారీ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 23 నుండి ప్రారంభం కానున్న ఈ సేల్ లో తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు ఉన్న ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ పోకో పరికరాలు ఉత్తమ ఎంపికలు అవుతాయి. ఈ క్రమంలో ఏ ఫోన్ పై ఎంత డిస్కౌంట్ అందుబాటులో ఉందో తెలుసుకుందాం.
Poco X7 5G:
పోకో X7 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ ధర రూ.24,999. కానీ, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో దీనిని కేవలం రూ.14,999 కు కొనుగోలు చేయవచ్చు. ఇది బ్లాక్, ఎల్లో రంగులలో లభిస్తోంది. ఇది ప్రత్యేకమైన డ్యూయల్-టోన్ డిజైన్‌తో వస్తుంది. దీనికి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ ను అమర్చారు.
Poco X7 Pro 5G:
ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఈ ఫీచర్-ప్యాక్డ్ ఫోన్ పోకో X7 ప్రో 5G స్మార్ట్ ఫోన్. దీని అసలు ధర రూ.27,999. కానీ, ఈ సేల్‌లో ఇది కేవలం రూ.19,999 కి అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ ను అమర్చారు. ఇది 6500mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది.
POCO F7 5G:
పోకో F7 5G స్మార్ట్ ఫోన్ కంపెనీ తాజా తరం F సిరీస్ స్మార్ట్‌ఫోన్. దీని డిజైన్, పనితీరు కారణంగా ఈ పరికరం రిలీజ్ అయినా కొన్ని రోజులకే ప్రజాదరణ పొందింది. దీని లాంచ్ ధర రూ.31,999. కానీ, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో దీని కేవలం రూ.28,999 కు కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్‌లో 7550mAh బిగ్ బ్యాటరీని అందించారు.
Poco M7 5G:
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ ఫోన్ బంపర్ డిస్కౌంట్ తర్వాత రూ. 8,799 కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో, 6.88-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్ అమర్చారు. కెమెరా సెటప్ గురించి చెప్పాలంటే, ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, షార్ప్ ఫోటోల కోసం 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. అయితే సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఇది 5160mAh బ్యాటరీ ఉంది.
Poco M7 Plus 5G:
ఈ సేల్‌లో ఈ ఫోన్ రూ. 10,999కు కొనుగోలు చేయొచ్చు. పోకో M7 ప్లస్ 5G క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ పరికరం ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఈ పోకో ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల పూర్తి-HD + డిస్‌ప్లేను కలిగి ఉంది.
Poco M7 Pro 5G:
పోకో M7 ప్రో 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది డాల్బీ అట్మోస్ స్పీకర్లతో వస్తుంది. ఇది OIS, f / 1.5 తో 50MP సోనీ LYT-600 కెమెరా ఉంది. ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్‌సెట్ అమర్చారు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,110mAh బ్యాటరీని కలిగి ఉంది. కాగా, ఇది పోకో M7 ప్రో 5G ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 11,499 కు కొనుగోలుకు ఉంది.


