Saturday, November 15, 2025
Homeటెక్నాలజీFlipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్..రెడ్‌మి స్మార్ట్ ఫోన్స్ పై...

Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్..రెడ్‌మి స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్లు..

Big Billion Days Redmi SmartPhones Deals: త్వరలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే అనేక బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ పై ఉన్న డీల్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేసింది. తాజాగా కంపెనీ రెడ్‌మి స్మార్ట్ ఫోన్ల పై ఉన్న డిస్కౌంట్లను రివీల్ చేసింది. గణనీయమైన తగ్గింపుతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఈ సేల్ సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పుడు రెడ్‌మి ఫోన్‌లపై ఉన్న డీల్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

- Advertisement -

 

Redmi Note 14 SE 5G

ఈ ఫోన్ 6.67-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, 20-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 5110mAh బ్యాటరీ అందించారు. డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్ అమర్చారు. ఈ సేల్ లో ఫోన్ రూ.12,999 ప్రభావవంతమైన ధరకు అందుబాటులో ఉంటుంది.

 

Airtel Redmi A5

ఈ సేల్ సమయంలో ఫోన్ రూ.5,999 ప్రభావవంతమైన ధరకు ఉంటుంది. ఈ ఫోన్‌లో 6.88-అంగుళాల డిస్‌ప్లే, 32-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 5200 mAh బ్యాటరీ, T7250 ప్రాసెసర్ ఉన్నాయి. కాగా, ఈ ఫోన్‌ ఎయిర్‌టెల్ సిమ్ తో మాత్రమే పనిచేస్తుంది.

Also Read:Smart Phones Under 6K: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్..రూ. 6వేల లోపు లభించే 6స్మార్ట్ ఫోన్లు..5000mAh బ్యాటరీ, 50MP కెమెరా..

Redmi A5

ఈ ఫోన్‌లో 6.88-అంగుళాల డిస్‌ప్లే ఇచ్చారు. 32-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. 5200 mAh బ్యాటరీ, T7250 ప్రాసెసర్ ఉన్నాయి. సేల్ లో ఈ ఫోన్ ధర రూ.6,499.

 

Redmi 14C 5G

5160 mAh బ్యాటరీతో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.8,999. ఈ ఫోన్‌లో 6.88-అంగుళాల డిస్‌ప్లే, 50-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఉంది.

 

Redmi 13 5G

సేల్ సమయంలో కస్టమర్లు ఈ ఫోన్ రూ.12,499 కు కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్‌లో 6.79-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. 108-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా అందించారు. ఇది 5030mAh బ్యాటరీతో స్నాప్‌డ్రాగన్ 4s Gen 2 ప్రాసెసర్ కలిగి ఉంది.

 

Redmi Note 14 Pro 5G

ఈ ఫోన్‌లో 6.67-అంగుళాల డిస్‌ప్లే, 50-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా, 20-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5500mAh బ్యాటరీ, డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ ఉన్నాయి.ఈ ఫోన్ సేల్ సమయంలో రూ.20,999 ధరకు అందుబాటులో ఉంటుంది.

 

Redmi Note 14 Pro+ 5G

రూ.24,999 ధరతో వస్తోన్న ఈ ఫోన్లో 6.67-అంగుళాల డిస్‌ప్లే అందించారు. 50-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా, 20-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 6200mAh బ్యాటరీ అందించారు.

 

Xiaomi 14 Civi

ఈ ఫోన్ రూ.30,999 ధరకు అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లో 6.55-అంగుళాల డిస్‌ప్లే, 50-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరా, 32+32-మెగాపిక్సెల్ డ్యూయల్ సెల్ఫీ కెమెరా, 4700mAh బ్యాటరీ ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad