Saturday, November 15, 2025
Homeటెక్నాలజీFlipkart Mobile Offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఫెస్టివ్‌ ధమాకా పేరుతో కొత్త సేల్‌.. గూగుల్ పిక్సెల్‌పై ఎన్నడూ...

Flipkart Mobile Offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఫెస్టివ్‌ ధమాకా పేరుతో కొత్త సేల్‌.. గూగుల్ పిక్సెల్‌పై ఎన్నడూ లేనంత తగ్గింపు..!

Flipkart Big Festive Dhamaka Sale: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ దసరా సందర్భంగా ఇటీవలే ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ను తీసుకొచ్చింది. ఈ సేల్ దాదాపు వారం రోజుల పాటు కొనసాగి అక్టోబర్‌ 2న ముగిసింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్‌టీవీలు, స్మార్ట్ వాచ్‌లతో సహా మరెన్నో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ అప్లయెన్సెస్‌లపై భారీ బంపరాఫర్లు అందించింది. ప్రస్తుతం, ఈ సేల్‌ ముగియడంతో మరో సేల్‌తో ముందుకొచ్చింది. బిగ్‌ ఫెస్టివ్‌ ధమాకా సేల్‌ పేరుతో మరో సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ముఖ్యంగా గూగుల్‌ పిక్సెల్‌ 9 స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ. 25 వేల వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో మీరు భారీ డిస్కౌంట్‌తో అతి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని చేస్తున్నట్లయితే గూగుల్‌ పిక్సెల్‌ 9 బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పవచ్చు.

- Advertisement -

గూగుల్‌ పిక్సెల్‌ 9పై రూ. 25 వేల తగ్గింపు..

గూగుల్‌ పిక్సెల్‌ 9లోని 12GB/256GB స్టోరేజ్ వేరియంట్ గతేడాది ఆగస్టులో రూ.79,999 ధర వద్ద లాంచ్ అయింది. ఇప్పుడు ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.54,999 ధర వద్ద అందుబాటులో ఉంది. అంటే దాదాపు రూ.25000 భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ డిస్కౌంట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై 5% క్యాష్‌బ్యాక్ (రూ.750 వరకు) వస్తుంది. ఈ తగ్గింపు తర్వాత దీని ధర రూ.54,249 కు పడిపోయింది. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా దీన్ని కేవలం రూ.39,640 వద్ద కొనుగోలు చేయవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ చేయాలనుకున్న మొబైల్ మోడల్, పనితీరు ఆధారంగా దీని ధరను నిర్ణయిస్తారు.

గూగుల్‌ పిక్సెల్‌ 9 స్పెసిఫికేషన్లు..

గూగుల్‌ పిక్సెల్‌ 9 స్మార్ట్‌ఫోన్‌ 6.3-అంగుళాల యాక్టువా OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 1080×2424 పిక్సెల్స్‌ రిజల్యూషన్, 60Hz-120Hz రిఫ్రెష్ రేట్, 2,700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ టెన్సర్ G4 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 పై రన్‌ అవుతుంది. వైఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్‌, డ్యూయల్-బ్యాండ్ GNSS, యూఎస్‌బీ టైప్-C పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయి. డిస్ప్లే సేఫ్టీ కోసం ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ను అందించింది. సేఫ్టీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించింది. ఇక, కెమెరా సెటప్ విషయానికొస్తే.. గూగుల్‌ పిక్సెల్‌ 9లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ వైడ్-యాంగిల్ కెమెరా, వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10.5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. గూగుల్‌ పిక్సెల్‌ 9 స్మార్ట్‌ఫోన్ డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టుతో కూడిన 4,700mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అలాగే Qi-సర్టిఫైడ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad