Flipkart Diwali Offer on Google Pixel 9 Pro XL: ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ దీపావళి పండుగ సందర్భంగా కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించాయి. మునుపెన్నడూ లేని విధంగా మార్ట్ ఫోన్లు, టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జిలపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. అయితే, నిన్నటితో అమెజాన్‌తో పాటు ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో దీపావళి సేల్‌లు ముగియగా.. ఫ్లిప్‌కార్ట్ “బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్” మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ సేల్ సమయంలో కస్టమర్లకు స్మార్ట్‌ఫోన్లపై అనేక ఆఫర్లు అందిస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్ ఆఫర్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో భాగంగా గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్‌ను భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ, మీరు ప్రీమియం ఫోన్‌ను పరిశీలిస్తుంటే.. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ పండుగ ఆఫర్ అతి త్వరలోనే ముగియనుంది. మళ్లీ ఇలాంటి అధిరిపోయే ఆఫర్ రాకపోవచ్చు. కాగా, గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్ భారత మార్కెట్‌లో రూ.1,24,999 ధర వద్ధ లాంచ్ అయింది. అయితే, ఆఫర్‌లో భాగంగా దివాళీ సేల్‌లో ఈ ఫోన్‌ను కేవలం రూ.89,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. అంటే, ఈ ఫోన్‌పై ఏకంగా రూ.35,000 డైరెక్ట్ డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఈఎంఐ రూపంలో కొనుగోలు చేస్తే.. మీకు అదనంగా రూ.4,250 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా మరింత తక్కువ ధరకే దీన్ని కొనుగోలు చేయవచ్చు.
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్ స్పెసిఫికేషన్లు..
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్ ఫోన్ 1344 x 2992 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, HDR సపోర్ట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో తయారైంది. ఇక, కెమెరాల విషయానికొస్తే.. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్ ఫోన్‌లో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా (ఐఓఎస్ మద్దతుతో), 48 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 48 ఎంపీ టెలిఫోటో సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. దీని ముందు భాగంలో అద్భుతమైన సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 42 ఎంపీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ గూగుల్ టెన్సార్ G4 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5060mAh బ్యాటరీతో వస్తుంది.


