Saturday, November 15, 2025
Homeటెక్నాలజీFlipkart Mobile Offers: ఇదేం ఆఫర్‌ భయ్యా.. రూ. 25 వేల రియల్‌మీ ఫోన్‌ కేవలం...

Flipkart Mobile Offers: ఇదేం ఆఫర్‌ భయ్యా.. రూ. 25 వేల రియల్‌మీ ఫోన్‌ కేవలం రూ. 3 వేలకే.. ఎలాగంటే?

Flipkart Diwali Offer on Realme P4 Pro 5G Smartphone: బడ్జెట్‌, మిడ్‌రేంజ్‌ సెగ్మెంట్‌లో ప్రీమియం ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను రిలీజ్‌ చేస్తోంది రియల్‌మీ. రియల్‌మీ తాజాగా రియల్‌మీ పీ4 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్‌ చేసింది. ఈ ఫోన్‌పై ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అధిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బ్యాంగ్ దివాళీ సేల్ సమయంలో చాలా తక్కువ ధరకే దీన్ని అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్‌ సైతం పండుగ సేల్ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. తక్కువ ధరలో సూపర్‌ ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని చూస్తుంటే రియల్‌మీ పీ4 ప్రో 5జీ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర, ఫీచర్లు, ఆఫర్ల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

రియల్‌మీ పీ4 ప్రో 5జీ ఆఫర్లు..
రియల్‌మీ పీ4 ప్రో 5జీలోని 8 జీబీ/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఈ ఏడాది ఆగస్టులో రూ.24,999 వద్ద రిలీజైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫెస్టివల్‌ ఆఫర్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.22,999 వద్ద అందుబాటులో ఉంది. ఎంచుకున్న క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై రూ.2 వేల డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తర్వాత అనంతరం దీని ధర రూ.20,999కి వస్తుంది. అంటే, ఈ ఫోన్‌పై లాంచింగ్‌ ధర కంటే రూ.4 వేల తగ్గింపు లభిస్తుంది. అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా లభిస్తాయి. మీ పాత ఫోన్‌ ఎక్స్‌చేంజ్‌ చేయడం ద్వారా రూ.17,650 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్‌ కూడా పొందొచ్చు. అయితే, ఈ ఎక్స్‌ఛేంజ్‌ ప్రైజ్‌ మీరు ఎక్స్‌చేంజ్‌ చేసే స్మార్ట్‌ఫోన్‌, కండీషన్‌ను బట్టి నిర్ధారిస్తారు. కాగా, ఈ డిస్కౌంట్‌ అనంతరం స్మార్ట్‌ఫోన్‌ని కేవలం రూ.3349లకే సొంతం చేసుకోవచ్చు.

రియల్‌మీ పీ4 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు..

రియల్‌మీ పీ4 ప్రో 5జీలో 6.8 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 1280×2800 పిక్సెల్‌ల రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 6,500 నిట్‌ల వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 5G ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7వ జెన్ 4 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్‌మే UI 6.0పై రన్‌ అవుతుంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP65, IP66 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. ఇక, కెమెరా సెటప్ విషయానికొస్తే.. రియల్‌మీ పీ4 ప్రో 5జీ వెనుక భాగంలో f/1.8 అపెర్చర్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, f/2.2 అపెర్చర్‌తో 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం f/2.4 అపెర్చర్‌తో 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్ల పరంగా చూస్తే.. దీనిలో డ్యూయల్ 5G, వైఫై 6, బ్లూటూత్ 5.4, జీపీఎస్‌, టైప్-సీ పోర్ట్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీతో వస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad