Saturday, November 15, 2025
HomeTop StoriesFlipkart Mobile Offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్‌ అదిరింది మావా..! మోటో ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌పై కళ్లు...

Flipkart Mobile Offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్‌ అదిరింది మావా..! మోటో ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌

Flipkart Mobile Offer on Motorola Edge 60 Fusion: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి పండుగ సందర్బంగా మోటరోలా స్మార్ట్‌ఫోన్‌పై బంపరాఫర్‌ ప్రకటించింది. ఇప్పటికే దీపావళి సేల్ ముగిసినప్పటికీ స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు మాత్రం కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా మోటరోలా ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌పై ఏకంగా రూ. 16 వేల తగ్గింపు అందిస్తోంది. మీరు రూ. 20 వేల కంటే తక్కువ బడ్జెట్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఇదే మీకు బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఈ మోటరోలా మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం, మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5Gపై అందుబాటులో ఉన్న ఆఫర్లు, డీల్స్‌ వివరాలు పరిశీలిద్దాం.

- Advertisement -

మోటరోలా ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌ 5G ధర..

మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G స్మార్ట్‌ఫోన్‌ విషయానికి వస్తే.. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫిబ్రవరి 2025లో రూ.22,999 వద్ద లాంచ్‌ అయ్యింది. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్‌లో రూ.19,999 వద్ద అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే.. ఐడీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై రూ.1500 తగ్గింపు పొందవచ్చు. అనంతరం, దీని ధర రూ.18,499 వరకు తగ్గుతుంది. దీనితో పాటు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.16,100 ఆదా చేసుకోవచ్చు. అయితే, ఇంత భారీ మొత్తంలో ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ పొందాలంటే మీ ఫోన్‌ కండీషన్‌ మెరుగ్గా ఉండాలి. మీ ఫోన్‌ మోడల్, కండీషన్‌ను బట్టి ఎక్స్‌ఛేంజ్‌ వాల్యూను డిసైడ్‌ చేస్తారు.

మోటరోలా ఎడ్జ్‌ 60 ఫ్యూజన్‌ 5G స్పెసిఫికేషన్లు

మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5Gలో 6.7 అంగుళాల 1.5K కర్వ్డ్ pOLED డిస్‌ప్లే ఉంటుంది. ఈ ఫోన్‌ 1220 x 2712 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంటుంది. ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హలో UI ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది. ఇది 68W వైర్డు టర్బో ఛార్జింగ్‌ సపోర్ట్‌ గల 5500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఇక, కెమెరా విషయానికి వస్తే.. ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5Gలో f/1.8 ఎపర్చరు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాను అందించింది. సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే.. 4జీ, 5జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్‌, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ వంటివి ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad