Flipkart Poco F7 5G Offer: ఇటీవల ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ దసరా, దీపావళి సందర్భంగా పలు సేల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి కస్టమర్లను ఆకట్టుకున్నాయి. అనేక వస్తువులపై భారీ తగ్గింపుల అందించాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లను అతి తక్కువ ధరకే అందించాయి. అయితే, ఇప్పుడు ఆ సేల్స్ ముగిసినప్పటికీ ఫ్లిప్‌కార్ట్ మాత్రం ఫోన్లపై ఆఫర్లు తగ్గించలేదు. ఇందులో భాగంగా కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, పోకో ఎఫ్7 5జి బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఎందుకంటే ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ పోకో ఎఫ్7 5జి స్మార్ట్‌ఫోన్‌పై గణనీయమైన తగ్గింపు అందిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తోంది.
పోకో ఎఫ్7 5జి ఆఫర్:
పోకో ఎఫ్7 5జి స్మార్ట్ ఫోన్ 12GB/256GB స్టోరేజ్ వేరియంట్ రూ.31,999కి లాంచ్ అయింది. ఇప్పుడు ఈ పరికరం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.30,999 కు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్‌లలో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.2,000 తగ్గింపు ఉంటుంది. దీని వలన ప్రభావవంతమైన ధర రూ.28,999కి వస్తుంది. అలాగే దీనిపై ఎక్స్ఛేంజ్ వవాల్యూ రూ.25,250 వరకు ఉంటుంది. కాకపోతే, ఎక్స్ఛేంజ్ విలువ పూర్తిగా పాత ఫోన్ కండిషన్, మోడల్ పై ఆధారపడి ఉంటుందని గుర్తించుకోండి. ఈ మొత్తం వర్తిస్తే ఈ ఫోన్ కేవలం రూ.3,749లకే సొంతం చేసుకోవచ్చు.
also read:Iphone 15 Discount: ఆపిల్ ఐఫోన్ 15 పై రూ.18,910 ఫ్లాట్ డిస్కౌంట్..కొనడానికి ఇదే మంచి ఛాన్స్!
పోకో ఎఫ్7 5జి ఫీచర్లు:
ఫీచర్ల విషయానికి వస్తే..పోకో ఎఫ్7 5జిలో 6.83-అంగుళాల అమోలేడ్ డిస్‌ప్లే, 1280×2772 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 3,200 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా షియోమి హైపర్‌ఓఎస్ 2.0 పై నడుస్తుంది. కెమెరా సెటప్ పరంగా, F7 5Gలో OIS మద్దతుతో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు వెనుక భాగంలో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 20-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. బ్యాటరీ గురించి మాట్లాడితే..ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతుతో 7,550mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP66+IP68+IP69 రేటింగ్ కలిగి ఉంది. భద్రత కోసం..ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇక కనెక్టివిటీ ఎంపికలలో ఈ పరికరం 5G, 4G, Wi-Fi 7, బ్లూటూత్ 6.0, GPS, NFC, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


