Homeటెక్నాలజీFlipkart Mobile: ఫ్లిప్‌కార్ట్‌లో బంపరాఫర్‌.. ఐఫోన్‌ 15పై ఏకంగా రూ.22 వేల వరకు డిస్కౌంట్‌..!

Flipkart Mobile: ఫ్లిప్‌కార్ట్‌లో బంపరాఫర్‌.. ఐఫోన్‌ 15పై ఏకంగా రూ.22 వేల వరకు డిస్కౌంట్‌..!

Flipkart Offer on Iphone 15 Price and Specifications: ఆపిల్‌ ఐఫోన్లకు మార్కెట్‌లో ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను రిలీజ్‌ చేస్తూ మొబైల్‌ ప్రియులను ఆకట్టుకుంటోంది. అయితే, ప్రీమియం ధరలో వీటిని విడుదల చేస్తుండటంతో చాలా మంది కొనుగోలుకు వెనకడుగు వేస్తుంటారు. అటువంటి వారి కోసమే ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఐఫోన్‌ 15పై కళ్లు చెదిరే డిస్కౌంట్లను ప్రకటించింది. ఒకవేళ, మీరు ఎప్పటి నుంచో ఒక కొత్త ఐఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే.. ఇదే బెస్ట్‌ ఛాయిస్‌గా చెప్పవచ్చు. సెప్టెంబర్ 2023లో లాంచ్ అయిన ఐఫోన్‌ 15పై ఆపిల్‌ సంస్థ భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. దీనికి అదనంగా బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా అడిషనల్‌ డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు. ఐఫోన్‌ 15 ఆఫర్లు, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

ఐఫోన్‌ 15పై రూ.22 వేల తగ్గింపు..

ఐఫోన్‌ 15లోని 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ లాంచింగ్‌ సమయంలో రూ.79,900 ధర వద్ద రిలీజైంది. అయితే, ఆఫర్‌లో భాగంగా దీన్ని కేవలం రూ.59,900 ధర వద్ద అందుబాటులోకి తెచ్చింది. బ్యాంక్ ఆఫర్లలో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ట్రాన్షక్షన్లపై రూ.2 వేల వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈ డిస్కౌంట్‌ అనంతరం దీని ధర రూ.57,900కు చేరుకుంటుంది. అంతేకాదు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా మరో రూ.41,400 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే, మీ పాత ఫోన్ కండీషన్‌, మోడల్‌ను బట్టి ఎక్స్‌ఛేంజ్‌ డిస్కౌంట్‌ ఆధారపడి ఉంటుంది. అంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కాకుండా డైరెక్ట్ డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్‌ కలిపి దాదాపు రూ.22,000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ఐఫోన్‌ 15 స్పెసిఫికేషన్లు ఇవే..

ఐఫోన్‌ 15 స్మార్ట్‌ఫోన్‌ 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 1179×2556 పిక్సెల్‌ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్‌ వరకు బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇది ఆపిల్‌ A16 బయోనిక్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఈ ఐఫోన్ ఐఓఎస్‌ 18 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. ఐఫోన్‌ 15 డస్ట్‌ అండ్‌ వాటర్‌ రెసిస్టన్స్‌ను కలిగి ఉంది. ఇక, కెమెరా సెటప్ విషయానికొస్తే.. ఐఫోన్‌ 15 వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్‌ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 12 మెగాపిక్సెల్ ట్రూడెప్త్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే.. 5జీ, జీపీఎస్‌, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్, వైఫై , డెడికేటెడ్ పోర్ట్ వంటివి ఉన్నాయి. అలాగే, దీనిలోని సెన్సార్లలో యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, బేరోమీటర్, కంపాస్/మాగ్నెటోమీటర్ వంటివి ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News