Flipkart Republic Day Sale offers on Iphone: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 ప్రారంభమైంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ల నుంచి హోమ్ అప్లయన్సెస్ వరకు అన్నింటిపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ముఖ్యంగా ఐఫోన్ కొనాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నవాళ్లు 10 శాతం అదనపు తగ్గింపుతో పాటు, ఇతర బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌ల ద్వారా ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 17పై భారీ డిస్కౌంట్..
గతేడాది సెప్టెంబర్‌లో విడుదల అయిన ఐఫోన్ 17పై ఫ్లిప్‌కార్ట్ తొలిసారి భారీ డిస్కౌంట్ ప్రకటించింది. రూ. 82,900 ధర ఉన్న ఈ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇప్పుడు ఆకర్షణ ధర రూ. 74,900కే లభిస్తోంది. దీనిలో 6.3 ఇంచ్ సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే, అత్యాధునిక A19 చిప్‌సెట్ వంటివి ఉన్నాయి. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం 48 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా, 18 ఎంపీ సెల్ఫీ కెమెరాను అందించింది. నెలకు కేవలం రూ. 6,909 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఇక, ఐఫోన్ 16 విషయానికి వస్తే.. ఈ సేల్‌లో ఐఫోన్ దాదాపు రూ. 56,999కి పడిపోయింది. A18 చిప్‌సెట్‌తో శక్తివంతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఈ ఫోన్‌లో 48 ఎంపీ మెయిన్ కెమెరా ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్నవాళ్లకి అదనంగా రూ. 4 వేల వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుండటంతో ఈఎంఐ ఆప్షన్ ద్వారా నెలకు రూ. 2,458 చెల్లించి ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ 15, ఐఫోన్ ఎయిర్‌పైనా..
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న సేల్‌లో ఐఫోన్ 15పై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా దీని అసలు ధర కంటే రూ.10 వేల నుండి రూ. 12 వేల వరకు తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. అదనంగా, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే, పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా భారీ డిస్కౌంట్ పొందవచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉండటంతో నెలవారీ వాయిదాల్లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇక, స్టైలిష్, స్లిమ్ డిజైన్‌ను ఇష్టపడే వారి కోసం ఐఫోన్ ఎయిర్‌పై కూడా ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఏకంగా రూ. 17 వేల డైరెక్ట్ డిస్కౌంట్‌తో ఈ ఫోన్ ఇప్పుడు రూ. 99,900కి అందుబాటులో ఉంది. 6.5 అంగుళాల భారీ డిస్‌ప్లే, A19 అడ్వాన్స్‌డ్ ప్రాసెసర్ గల ఈ ప్రీమియం మోడల్‌పై బ్యాంక్ ఆఫర్లతో ధర మరింత తగ్గుతుంది. ఈ స్పెషల్ డిస్కౌంట్లతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10% డిస్కౌంట్, బజాజ్ ఫిన్‌సర్వ్ ఇన్‌స్టా ఈఎంఐ కార్డులపై రూ. 400 అదనపు డిస్కౌంట్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డులపై 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తాయి. మీ పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా వేల రూపాయలను ఆదా చేసుకోవచ్చు. అలాగే ఐఫోన్ అప్‌గ్రేడ్ అవ్వాలనుకునే వారికి ఇది బెస్ట్ సేల్‌గా చెప్పవచ్చు.

