Flipkart Republic Day Sale offers on SmartTV: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘రిపబ్లిక్ డే సేల్-2026’ ప్రారంభమైంది. నేటి (జనవరి 17) అర్థరాత్రి 12 గంటలకు ప్రారంభమైన ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లను ప్రకటించింది. ముఖ్యంగా 50 ఇంచుల స్మార్ట్ టీవీని అతి తక్కువ ధరలో సొంతం చేసుకునేలా ఆఫర్లు ప్రకటించింది. తక్కువ ధరలోనే ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభూతిని అందించే 50 ఇంచుల స్మార్ట్ టీవీలపై అమెజాన్ అందిస్తున్న ఆఫర్ల గురించి తెలుసుకుందాం. ఈ ఫ్లిప్‌కార్ట్ ‘రిపబ్లిక్ డే సేల్’లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసే వారికి అదనపు క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు కూడా లభిస్తున్నాయి. ఈ సేల్‌లో లభిస్తున్న కొన్ని బెస్ట్ 50 ఇంచుల స్మార్ట్‌టీవీ డీల్స్ గురించి తెలుసుకుందాం.
1. ఫిలిప్స్ 50 అంగుళాల టీవీ
తక్కువ బడ్జెట్‌లో మంచి బ్రాండ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. దీని అసలు ధర రూ. 32,999 ఉండగా.. రిపబ్లిక్ డే సేల్‌లో కేవలం రూ. 23,999 కే లభిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా మరో రూ.1,250 డిస్కౌంట్ వస్తుంది. ఇందులో 4K, డాల్బీ విజన్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
2. మోటరోలా 50 అంగుళాల టీవీ
ఈ సేల్‌లో అత్యధికంగా 58% డిస్కౌంట్ లభిస్తున్న టీవీ ఇదే. రూ. 69,099 విలువైన ఈ మినీ ఎల్‌ఈడీ టీవీని ఇప్పుడు రూ. 28,999 కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్ ద్వారా అదనంగా మరో రూ. 1,500 డిస్కౌంట్ లభిస్తుంది.
3. హైయర్
ఈ క్యూఎల్‌ఈడీ అల్ట్రా హెచ్‌డీ ప్లస్ 4K టీవీపై 44 శాతం డిస్కౌంట్ ఉంది. లాంచ్ ధర రూ. 55,990 కాగా, ఇప్పుడు సేల్‌లో దీన్ని రూ. 30,990 కే కొనుగోలు చేయవచ్చు. దీనిపై రూ. 2 వేల బ్యాంక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
4. లూమియో విజన్ 7
ప్రస్తుతం మార్కెట్లో క్రేజ్ సంపాదిస్తున్న ఈ బ్రాండ్ టీవీ రూ. 58,999 నుంచి రూ. 32,499 కు తగ్గింది. ఇది గూగుల్ టీవీ సపోర్ట్, డాల్బీ అట్మోస్ వంటి హై-ఎండ్ ఫీచర్లతో వస్తుంది. కార్డుపై రూ. 2 వేల అదనపు డిస్కౌంట్ ఉంటుంది.
5. హిస్సెన్స్
శక్తివంతమైన 48W స్పీకర్లు కలిగిన ఈ క్యూఎల్‌ఈడీ టీవీని రూ. 29,999కే కొనుగోలు చేయవచ్చు. దీనిపై రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా వర్తిస్తుంది. మీరు పాత టీవీని మార్చి కొత్త స్మార్ట్ టీవీని ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే, ఈ ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సరైన సమయం అని చెప్పవచ్చు. మరెందుకు ఆలస్యం వెంటనే కొనేయండి.

