Flipkart Sale Ear Buds: పండుగ సీజన్ రావడంతో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్‌ను ప్రారంభించాయి. ఈ సేల్‌లో అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అధిరిపోయే ఆఫర్లను ప్రకటించాయి. అనేక ఉత్పత్తులపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో కొన్ని క్రేజీ ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఏకంగా 70 శాతం తక్కువ ధరలో బ్లూటూత్ ఇయర్ బడ్స్ కోసం మీరు చూస్తుంటే ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈ సేల్‌లో రూ. 300 నుంచి రూ.500 లోపే లభిస్తున్న బెస్ట్ ఇయర్ బడ్స్‌పై ఓలుక్కేద్దాం.
ఆరోమా ఎన్ బీ 121
ఆరోమా ఎన్ బీ 121 పాడ్స్ అనే ఇయర్ బడ్స్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ధరకి లభిస్తున్నాయి. ఈ బడ్స్ ఒరిజినల్ ప్రైస్ రూ.1299 ఉండగా ఆఫర్‌లో భాగంగా దీన్ని కేవలం రూ.299 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ బ్లూటూత్ 5.4 బ్లూటూత్ వెర్షన్‌తో పని చేస్తుంది. బడ్స్ కేస్.. 40 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. దీనిలో ఇన్ బిల్ట్ మైక్రో ఫోన్ కూడా ఉంది. హైఫై స్టీరియో సౌండ్ సిస్టమ్ పనిచేస్తుంది. దీనిలో టచ్ కంట్రొల్స్‌ను కూడా అందించింది. చూడ్డానికి ఇది ప్రీమియం లుక్ లో కనిపించే ఈ ఇయర్‌బడ్ ఆఫర్‌లో భాగంగా కేవలం రూ. 299 వద్ద అందుబాటులో ఉంది. ఇది ప్యూర్ వైట్ కలర్ లో యాపిల్ పాడ్స్ డిజైన్ తో వస్తుంది.
రాక్ టచ్ ప్రో 3
ఫ్లిప్‌కార్ట్ సేల్ లో రాక్ టచ్ టీ80 అనే మరో ఇయర్ బడ్స్ కూడా చాలా తక్కువ ధరలో లభిస్తోంది. దీని అసలు ధర రూ. రూ.799 ఉండగా.. దీన్ని కేవలం రూ. 281 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇది 5.1 బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. దీనిలోని బ్యాటరీ 30 గంటల వరకూ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. దీనిలో ఇన్ బిల్ట్ మైక్రోఫోన్ కూడా ఉంటుంది. బ్లూటూత్ రేంజ్ 10 మీటర్ల వరకూ పనిచేస్తుంది.
టెకియో ఎయిర్ పాడ్స్
టెకియో అనే బ్రాండ్ ఇయర్ పాడ్స్ కూడా ఫ్లిప్ కార్ట్ లో రూ. 257 ధరకే లభిస్తున్నాయి. వీటి అసలు ధర రూ.899 ఉండగా తక్కువ ధరకే లభిస్తుండటం విశేషం. ఈ ఎయిర్ పాడ్స్ 5.2 బ్లూటూత్ కనెక్షన్‌తో వస్తుంది. ఇది 24 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఐపీ రేటింగ్ కూడా ఉంది. మాయిశ్చర్ ను కూడా తట్టుకుంటుంది. ఈ బ్లుటూత్ రేంజ్ 10 మీటర్లు ఉంటుంది. 3డీ సౌండ్ క్వాలిటీ ఫీచర్‌ను కలిగి ఉంటుంది.


