Ear Buds Under Rs.1000: ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి టెక్ లవర్స్ కాదలనేని ఆఫర్లతో వచ్చేసింది. ప్రతిసారీ విభిన్న గాడ్జెట్లు వాటిపై అద్భుతమైన డిస్కౌంట్లతో వచ్చే ఈకామార్స్ దిగ్గజం.. ఈసారి మాత్రం రెండు కొత్త మోడల్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అవే గోబౌల్ట్ జెడ్40, మివి డ్యూపోడ్స్ బి1 ఇయర్ బడ్స్. వీటి ధరలు ఆశ్చర్యపరిచేంత తక్కువగా ఉన్నప్పటికీ, ఫీచర్లు కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రీమియం స్థాయిలోనే ఉన్నాయి.
గోబౌల్ట్ జెడ్40..
మొదటగా గోబౌల్ట్ జెడ్40 గురించి పరిశీలిస్తే.. దీని అసలు ధర దాదాపు రూ.5 వేలు. కానీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఇది జస్ట్ రూ. 799కే లభిస్తోంది. అంటే 84 శాతం భారీ తగ్గింపు. అంతేకాక భీమ్ యాప్ ద్వారా చెల్లిస్తే అదనంగా 50 రూపాయల తగ్గింపు,.. పేటీఎం ద్వారా పేమెంట్ పూర్తి చేస్తే 10 రూపాయల తగ్గింపు కూడా ఉందండి. అంటే మొత్తంగా జెడ్40ను చాలా తక్కువ రేటుకే సొంతం చేసుకునేందుకు ఇదొక మంచి సమయం అని చెప్పుకోవచ్చు.
ఇది బ్లూటూత్ 5.3 వెర్షన్‌తో వస్తుంది.. అందువల్ల కనెక్షన్ ఫాస్ట్‌గా, స్టేబుల్‌గా ఉంటుంది. గేమింగ్ సమయంలో సౌండ్ ల్యాగ్ లేకుండా.. రియల్‌టైమ్ ఆడియో అనుభవాన్ని ఇస్తుంది. ఆన్ లైన్ గేమ్స్ ఆడేవారికి ఇది తగిన బెస్ట్ ఆప్షన్. ఇక కాలింగ్ విషయంలోనూ ఈ గాడ్జెట్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇందులో ఉన్న ఈఎన్‌సి (Environmental Noise Cancellation) మైక్ టెక్నాలజీ వలన చుట్టూ ఉన్న శబ్దాలను అడ్డుకుంటూ.. మీ వాయిస్‌ను స్పష్టంగా రికార్డ్ చేస్తుంది. పైగా ప్రీమియం లుక్ తో, దీని మెటల్ ఫినిష్ డిజైన్ అందరినీ ఆకట్టుకుంటోంది. గ్రీన్, నేవీ బ్లూ, బ్రౌన్, వైట్ రంగుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. అలాగే ఒక్కసారి చార్జ్ చేస్తే అరవై గంటల వరకూ బ్యాకప్ కలిగి ఉంటుంది.
మివి డ్యూపోడ్స్ బి..
ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లలో మరో హాట్ డీల్‌గా నిలిచిన మరో ఇయర్ బడ్స్ మివి డ్యూపోడ్స్ బి1. కొత్తగా విడుదలైన ఈ మోడల్ అసలు ధర రూ.2,999 కాగా.. ప్రస్తుతం ఇది కేవలం రూ.999కే లభిస్తోంది. భీమ్ యూపీఐ ద్వారా చెల్లిస్తే రూ.50, పేటీఎం ద్వారా చెల్లిస్తే రూ.10 తగ్గింపుతో దీని ధర రూ.949కి లభిస్తోంది. బ్లూటూత్ 5.3 టెక్నాలజీతో కనెక్షన్‌ను స్టేబుల్‌గా ఉంచుతుంది. 45 గంటల వరకు ప్లే టైమ్ అందిస్తుంది. రోజువారీ వాడకంలో మూడు నుంచి నాలుగు రోజుల వరకు చార్జింగ్ అవసరం లేకుండా పనిచేస్తుంది. ఏఐ ఈఎన్‌సి టెక్నాలజీ వలన కాల్స్ సమయంలో బయటి శబ్ధాలు లేకుండా మీ వాయిస్ స్పష్టంగా వినిపిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కేవలం 10 నిమిషాల చార్జ్‌తో గంటల పాటు వినిపింపునిస్తుంది.


