Foxconn Ships India-Made iPhones To US: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో ఆపిల్ ఫోన్లు ఎందుకు వద్దంటున్నారో.. ఇప్పుడు తెలిసింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, 2025 మార్చి- మే మధ్య అమెరికాకు ఆపిల్ ఎగుమతి చేసిన అన్ని ఐఫోన్లలో 97 శాతం భారతదేశంలోనే తయారు చేశారు. అమెరికాలో అమ్ముడైన దాదాపు అన్ని ఐఫోన్లు భారతదేశంలోనే తయారవుతున్నాయి. అందుకే ట్రంప్ భారత్లో ఆపిల్ వద్దంటూ బెదిరింపులు చేస్తున్నాడు.
ఆపిల్ ఫోన్ల ఖర్చు $3.2 బిలియన్లు (రూ. 27,000 కోట్లు). మే నెలలోనే దాదాపు $1 బిలియన్ విలువైన ఐఫోన్లు అంటే భారతదేశం నుండి 8,600 కోట్ల రూపాయల ఐఫోన్‌లను అమెరికాకు పంపారు. ఆపిల్ ఇప్పుడు అమెరికా మార్కెట్ కోసం ప్రత్యేకంగా భారతదేశంలో ఐఫోన్లను తయారు చేస్తోంది. 2025 జనవరి నుండి మే వరకు, భారతదేశం నుండి అమెరికాకు $4.4 బిలియన్ల (రూ.37 వేల కోట్లు) విలువైన ఐఫోన్‌లు ఎగుమతి చేశారు.
2024లో జరిగిన 3.7 బిలియన్ల ఎగుమతుల సంఖ్య కంటే ఇది ఎక్కువ. 2024 నాటికి అమెరికాలో అమ్ముడైన ఐఫోన్‌లలో 50 శాతం భారతదేశంలో తయారు చేయబడినవే ఉన్నాయి. మే 23న డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో విక్రయించే ఐఫోన్‌లను భారతదేశంలో లేదా మరే ఇతర దేశంలో కాకుండా అమెరికాలో తయారు చేయాలని అన్నారు. ఆపిల్ అమెరికాలో ఐఫోన్‌లను తయారు చేయకపోతే, ఆ కంపెనీపై కనీసం 25% సుంకం విధిస్తామని ఆయన ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ను బెదిరాంచారు.