Tuesday, June 24, 2025
Homeటెక్నాలజీJio: ఈ జియో ప్లాన్‌లలో ఉచిత నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్..!

Jio: ఈ జియో ప్లాన్‌లలో ఉచిత నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్..!

Jio Recharge plan: జియో ఇతర టెలికాం వినియోగదారులను ఆకర్షించుకోవడానికి ఒకదాని తర్వాత ఒకటి కొత్త ప్లాన్‌లను ప్రకటిస్తూ వస్తోంది. అందరిని దృష్టిలో పెట్టుకొని కంపెనీ వివిధ రకాల ప్లాన్‌లను అందిస్తుంది. టెలికాం కంపెనీలు ప్రతి ప్లాన్లలో అపరిమిత డేటా, కాల్స్ ఉండేలా తీసుకువస్తున్నాయి. ఇదే సమయంలో కంపెనీలు వినియోగదారుల వినోదాన్ని కూడా పూర్తిగా చూసుకుంటుంది. ఉచిత OTT సభ్యత్వాన్ని పొందే అనేక ప్లాన్‌లను కూడా అందిస్తుంది.

అయితే జియోలో ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది. దీనిలో ఉచిత నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వాన్ని పొందడమే కాకుండా 90 రోజుల పాటు ఉచిత జియో హాట్‌స్టార్ సభ్యత్వాన్ని కూడా పొందుతారు. దీనితో పాటు ఈ ప్లాన్‌లో కాలింగ్, డేటా సౌకర్యాన్ని కూడా పొందొచ్చు. ఇప్పుడు ఈ ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం.

జియో రూ.1299 ప్లాన్

జియో ఈ ప్లాన్ ధర రూ.1299. దీనిలో మొత్తం 84 రోజుల చెల్లుబాటును పొందొచ్చు. ఈ ప్లాన్ రోజుకు 2GB డేటాను కూడా అందిస్తోంది. దీనితో పాటు, ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని కూడా పొందుతారు. ప్రతిరోజూ 100SMS కూడా పంపవచ్చు. వినియోగదారుల వినోదం కోసం.. కంపెనీ ఈ ప్లాన్‌లో ఉచిత నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వాన్ని అందిస్తోంది. దీనితో 90 రోజుల పాటు ఉచితంగా JioHotstar మొబైల్ సభ్యత్వాన్ని కూడా పొందవచ్చు. ఇది పరిమిత కాల ఆఫర్. ఇదే సమయంలో 5G నెట్‌వర్క్ పరిధి బాగా ఉన్న ప్రాంతంలో ఉంటె ఈ ప్లాన్‌తో అపరిమిత 5Gని కూడా ఆస్వాదించవచ్చు. ఇది దీన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది. అంటే.. డేటా అయిపోతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News