Free Netflix Subscription: ప్రముఖ టెలికాం సంస్థ జియో కంపెనీ ప్రీపెయిడ్ రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోలో అనేక రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. ఇందులో అవసరాలకు తగ్గట్టు కస్టమర్లు తక్కువ-డేటా ప్లాన్ లేదా అధిక-డేటా ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. కొన్ని రీఛార్జ్ ప్లాన్లు ఉచిత డేటా ప్రయోజనాలతో పాటు ఇతర అనేక ప్రయోజనాలను కూడా అందిస్తాయి. జియో చాలా ప్లాన్‌లలో చాలా వరకు ఓటీటీ సేవలకు సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తున్నాయి. అయితే, కొన్ని రీఛార్జ్ ప్లాన్లు ఉచిత నెట్‌ఫ్లిక్స్ యాక్సెస్‌ను అందిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రూ.1,799 జియో రీఛార్జ్ ప్లాన్:
ఈ జియో రీఛార్జ్ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ తో ప్రతిరోజూ 3GB డేటా ఆస్వాదించవచ్చు. దీని అర్థం జియో 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతంలో ఉంటె, ఈ ప్లాన్‌తో అపరిమిత డేటాను పొందవచ్చు.ఇది అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. ఇతర ప్రయోజనాలతో పాటు, కంపెనీ ఈ ప్లాన్‌తో ప్రాథమిక నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. అదనంగా ఈ రీఛార్జ్ ప్లాన్ తో జియో టీవీ, జియో AI క్లౌడ్‌కు సబ్‌స్క్రిప్షన్‌లు కూడా ఫ్రీ. ఈ ప్లాన్‌లో 90 రోజుల పాటు జియో హాట్ స్టార్ కి ఉచిత మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది.
రూ. 1,299కి జియో రీఛార్జ్ ప్లాన్:
తక్కువ ధరకు దీర్ఘకాల చెల్లుబాటు, ఉచిత నెట్‌ఫ్లిక్స్ ఎంచుకుంటే, రూ. 1,299 రీఛార్జ్ ప్లాన్ గొప్ప ఎంపిక అవుతుంది. ఈ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. కాకపోతే, 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. డేటా అయిపోయాక స్పీడ్ 64 Kbps ఉంటుంది. అయితే, 5జీ డేటా అన్‌లిమిటెడ్‌గా పొందవచ్చు.ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు, రోజుకు 100 SMSలను పంపే అవకాశాన్ని కూడా అందిస్తుంది.ఈ ప్లాన్ 84 ద్వారా రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వాన్ని పొందవచ్చు. ఈ ప్లాన్ రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుండటంతో యూజర్లకు ప్లస్ అవుతుంది. అంతేకాకుండా ఈ ప్లాన్ తో జియో టీవీ, జియో AI క్లౌడ్‌కు సబ్‌స్క్రిప్షన్‌లు కూడా ఫ్రీగా పొందవచ్చు.


