Friday, December 12, 2025
Homeటెక్నాలజీGalaxy Tab A11+ Launched: 11-అంగుళాల TFT డిస్ప్లే, 7040mAh బ్యాటరీతో శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్...

Galaxy Tab A11+ Launched: 11-అంగుళాల TFT డిస్ప్లే, 7040mAh బ్యాటరీతో శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11+ లాంచ్!

Galaxy Tab A11+ Launch: చాలారోజుల నుంచి టాబ్లెట్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీకో గుడ్ న్యూస్! ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు శామ్సంగ్ తన కస్టమర్ల కోసం భారత మార్కెట్లో కొత్త టాబ్లెట్ ను అధికారికంగా లాంచ్ చేసింది. కంపెనీ దీని శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11+ పేరిట తీసుకొచ్చింది. ఈ టాబ్లెట్ 11-అంగుళాల TFT డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్, 7040mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో వస్తుంది. ఇప్పుడు ఈ కొత్త టాబ్లెట్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

 

శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11+ ధర, లభ్యత:

ధర విషయానికి వస్తే.. కంపెనీ శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11+ టాబ్లెట్ వైఫై మోడల్ కోసం 6+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999గా, 8+256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.28,999గా పేర్కొంది. మరోవైపు.. కంపెనీ వైఫై+5G మోడల్ 6+128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.26,999గా, 8+256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.32,999గా నిర్ణయించింది. ఈ టాబ్లెట్ టాబ్లెట్ గ్రే, సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది. కస్టమర్లు దీని శామ్‌సంగ్ ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు.

also read:Realme C85 5G Launched: 7,000mAh బ్యాటరీతో రియల్‌మీ C85 5G విడుదల..ధర కూడా తక్కువే!

శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11+ ఫీచర్లు

డిస్ప్లే:
ఈ టాబ్లెట్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 11-అంగుళాల TFT డిస్‌ప్లేను కలిగి ఉంది.

ప్రాసెసర్, స్టోరేజీ:
ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని 8GB వరకు ర్యామ్, 256GB అంతర్గత నిల్వతో జత చేశారు. అవసరమైతే మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి నిల్వను 2TB వరకు విస్తరించవచ్చు.

 

ఆండ్రాయిడ్:
ఇది ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా One UI 8పై నడుస్తుంది.

కెమెరా:
కెమెరా పరంగా చూస్తే..ఈ టాబ్లెట్ కు 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 8-మెగాపిక్సెల్ వెనుక కెమెరా ఉన్నాయి. రెండు కెమెరా సెన్సార్లు 30fps వద్ద 1080p వీడియోను రికార్డ్ చేస్తాయి.

also read:Oneplus 15 vs iQOO 15: ఈ రెండిట్లో ఏ ఫోన్ బెటరంటే..?

బ్యాటరీ:
ఈ టాబ్లెట్ 7040mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది గొప్ప డైమెన్షనల్ ఆడియో అనుభవాన్ని అందించే డాల్బీ-ఇంజనీర్డ్ క్వాడ్ స్పీకర్‌లను కలిగి ఉంది. టాబ్లెట్‌లో 3.5mm ఆడియో జాక్ కూడా ఉంది.

ఇతర ఫీచర్లు:
టాబ్లెట్ నానో-సిమ్ సపోర్ట్, USB 2.0 పోర్ట్, WiFi (2.4GHz + 5GHz), బ్లూటూత్ 5.3, GPS, Beidou, Galileo, QZSS వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని బరువు 482 గ్రాముల. కొలతలు 168.7×257.1×6.9mm.

 

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News