Lava Play Ultra 5G Launched: గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్. లావా గేమర్లకు సరికొత్త మొబైల్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. కంపెనీ దీని లావా ప్లే అల్ట్రా పేరిట తీసుకొచ్చింది. ఇది సరసమైన గేమింగ్ ఫోన్‌గా అందుబాటులోకి వచ్చింది. ఈ పరికరం లాంచ్ ఆఫర్ కింద, రూ. 14,000 కంటే తక్కువ ప్రారంభ ధరకు అందుబాటులో ఉండటం విశేషం. ఎన్నో అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ సంబంధించి ధర, లాంచ్ ఆఫర్, ఫీచర్లు గురించి వివరంగా తెలుసుకుందాం.
Lava Play Ultra 5G ధర, లాంచ్ ఆఫర్, లభ్యత:
కంపెనీ ఈ ఫోన్ 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999గా, 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,499గా పేర్కొంది. కాగా,ఈ పరికరం రెండు రంగులలో లభిస్తోంది. ఆర్కిటిక్ ఫ్రాస్ట్, ఆర్కిటిక్ స్లేట్. ఈ ఫోన్ కొనుగోలుపై కస్టమర్లు బ్యాంక్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రూ.1,000 తగ్గింపును పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్ తర్వాత 6GBRAM వేరియంట్ రూ.13,999 ప్రభావవంతమైన ధరకు, అదే విధంగా 8GB RAM వేరియంట్ రూ.15,499కి కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ మొదటి సేల్ ఆగస్టు 25న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. దీనిని కంపెనీ అధికారిక సైట్‌తో పాటు అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు.
Also Read: Reliance Jio: యూజర్లకు జియో షాక్.. మరో ప్లాన్ తొలగింపు
Lava Play Ultra 5G ఫీచర్లు:
ఈ పరికరం 6.67-అంగుళాల ఫ్లాట్ అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది పూర్తి-HD ప్లస్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. కంపెనీ దీనిని ప్రత్యేకంగా గేమింగ్ కోసం రూపొందించారు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో అమర్చారు. ఇది హైపర్ ఇంజిన్ టెక్నాలజీతో జత చేశారు.
ఈ ఫోన్ 8GB వరకు LPDDR4x RAM, 128GB UFS 3.1 స్టోరేజ్‌తో జత చేయబడింది. 6GB వేరియంట్ 6GB వర్చువల్ RAMకి మద్దతు ఇస్తుందని, 8GB వేరియంట్ 8GB వర్చువల్ RAMకి మద్దతు ఇస్తుందని కంపెనీ చెబుతోంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తోన్న లావా ప్లే అల్ట్రా క్లీన్ ఆండ్రాయిడ్ 15పై నడుస్తుంది. ఈ ఫోన్ రెండు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, మూడు సంవత్సరాల భద్రతా నవీకరణలకు అర్హత కలిగి ఉందని కంపెనీ చెబుతోంది.
ఫోటోగ్రఫీ కోసం..ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో సోనీ IMX682 సెన్సార్‌తో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం..ఫోన్ 13-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ నైట్ మోడ్, HDR, పోర్ట్రెయిట్, బ్యూటీ, పనోరమా, స్లో మోషన్, టైమ్ లాప్స్, ఫిల్టర్లు, ప్రో మోడ్, AR స్టిక్కర్లు, మాక్రో ఫోటోగ్రఫీ వంటి ఫోటోగ్రఫీ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది.
బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఫోన్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 83 నిమిషాలు పడుతుందని కంపెనీ పేర్కొంది. పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత, ఈ బ్యాటరీ 45 గంటల టాక్ టైమ్, 510 గంటల స్టాండ్‌బై సమయాన్ని ఇస్తుంది. ఛార్జింగ్ కోసం టైప్-సి పోర్ట్ అందుబాటులో ఉంది.
దుమ్ము, నీటి నుండి రక్షించడానికి ఫోన్ IP64 రేటింగ్‌తో వస్తుంది. కనెక్టివిటీ పరంగా.. ఈ ఫోన్ బ్లూటూత్ 5.2, OTG, Wi-Fi 6 వంటి ఫీచర్లు ఉన్నాయి. బలమైన ధ్వని కోసం ఫోన్‌లో స్టీరియో స్పీకర్లు అందించారు. ఫోన్‌లో ఫేస్ అన్‌లాక్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి.


