Saturday, February 22, 2025
Homeటెక్ ప్లస్Gold Price Today: వరుసగా మూడో పెరిగిన బంగారం ధరలు.. నిన్నటి తో పోలిస్తే..

Gold Price Today: వరుసగా మూడో పెరిగిన బంగారం ధరలు.. నిన్నటి తో పోలిస్తే..

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. తగ్గుతుంది అనుకున్న ప్రతిరోజు కుడా అమాంతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న బంగారం ధరలు చూస్తే కొనాలి అన్న ఆలోచన కుడా ఉండట్లేదు. బంగారం కొనాలి అనే మనసు మార్చుకుంటున్నారు. ఇప్పుడు కొనకపోతే ఇంకా పెరిగిపోతుందేమో అనే భయం కొంత ఆలోచనలో పడేస్తుంది. భవిష్యత్తులో తగ్గితే ఇప్పుడు కొన్నవారు మళ్లీ బాధపడాలి ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి.

- Advertisement -

బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. భారతదేశంలో ఎక్కువగా బంగారం ప్రధానంగా పండుగ సమయాల్లో, పెళ్లి సీజన్లలో పెద్దఎత్తున కొనుగోలు చేస్తారు. వీటి వల్ల ధరలు పెరుగుతుంటాయి. ప్రజలు గోల్డ్ ETF లు లేదా బంగారం లో పెట్టుబడులు పెట్టడం ద్వారా తగిన ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. అయితే, బంగారం ధరలు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మారవచ్చు, కాబట్టి కొనుగోలు చేయాలంటే జాగ్రత్తగా పరిశీలించాలి. అయితే నిన్న బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా, ఫిబ్రవరి 13న 22 క్యారట్ల బంగారం ఒక గ్రాము ధర రూ. 7980 గా ఉంది. అంటే పది గ్రాముల ధర రూ. 79800 గా ఉంది. అదే 24 క్యారట్ల బంగారం ఒక గ్రాము ధర రూ. 8705 గా ఉంది. అంటే 10 గ్రాముల ధర రూ.87050 గా ఉంది.

కానీ ఈరోజు బంగారం ధరలు మరలా పెరిగాయి. 22 క్యారట్ల బంగారం ఒక గ్రాము ధర రూ.10 లు పెరిగి రూ.7990 గా ఉంటే 10 గ్రాములకు రూ.79900 కి పెరిగింది. అంటే నిన్నటి మీద 10 గ్రాములకు రూ.100 పెరిగింది. అదే 24 క్యారట్ల బంగారం ధర ఒక గ్రాముకి రూ.11 లు పెరిగి రూ.8716 గా ఉంది అంటే 10 గ్రాముల బంగారం ధర రూ. 87160 గా ఉంది. ఈ ధరలు ఇలానే ఉంటాయనే నమ్మకం లేదు. మరలా పెరగవచ్చు, తగ్గవచ్చు అని భావిస్తున్నారు. బంగారం మీద పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఇది సరైన సమయం ఆ కాదా అని, ధరలు పెరిగే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఫిబ్రవరి 11వ తేదీతో పోలిస్తే ఈరోజు బంగారం ధర తక్కువే ఉంది..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News