బంగారం ధరలు నాలుగు రోజుల పాటు తగ్గిన తర్వాత, ఈ రోజు మార్చి 27, 2025 స్వల్పంగా పెరిగాయి. గత కొన్ని వారాలుగా బంగారం ధరలు ఆకాశాన్ని చేరాయి. మార్చి మొదటి వారంలో కొంత తగ్గినట్లు కనిపించిన పసిడి ధర, ఇప్పుడు మళ్లీ భారీగా పెరిగింది. బంగారం కొనాలా వద్దా అని ప్రజలు కుంగిపోతున్నారు. ఇటీవల బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకొని రూ.90,000 మార్కును టచ్ చేశాయి.
ఈ రోజు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.440 పెరిగి రూ.89,840కి చేరుకుంది. అలాగే, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.400 పెరిగి రూ.82,350కి చేరింది. బంగారం ధరలు కొంత తగ్గినప్పటికీ, మళ్లీ స్వల్పంగా పెరిగాయి, అయితే పసిడి ప్రియులకు ఇది కొంత ఊరట కలిగించాయి.
18 క్యారెట్ల బంగారం ధర రూ.330 పెరిగి రూ.67,380కి చేరుకుంది. మరోవైపు, వెండి ధర రూ.1000 పెరిగి దేశీయంగా రూ.1,02,000కి చేరుకుంది, హైదరాబాదులో కిలో వెండి ధర రూ.1,11,000గా ఉంది.