బంగారం రేట్లు తుఫాను వేగంతో పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ బంగారం తులం కొనాలన్నా భరించలేని స్థితి..! 2025 ఏప్రిల్ 1న బంగారం, వెండి ధరలు మరింత పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 85,100గా ఉండగా, 24 క్యారెట్ బంగారం ధర రూ. 92,840కి చేరుకుంది. బంగారమే కాదు, వెండి ధర భగ్గుమంది. ఒక్క రోజులోనే రూ. 1000 పెరిగి కిలో వెండి ధర రూ. 1,14,000కి చేరుకుంది.
బంగారం రకాలు – ఏది బెస్ట్?
24 క్యారెట్ బంగారం స్వచ్ఛమైనది, కానీ ఆభరణాల తయారికి పనికిరాదు. 22 క్యారెట్ బంగారం ఆభరణాల తయారికి సరైనది. అందుకే నగల ప్రియులు, పెట్టుబడిదారులు ఎక్కువగా దీన్నే ఎంచుకుంటారు. అంతర్జాతీయ మార్కెట్ మార్పులు, దిగుమతి సుంకాలు, పన్నులు, డాలర్ మారకం రేట్లు – ఇవన్నీ బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయి.
పెట్టుబడి చేయాలా?
మార్కెట్ ధరలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. పెట్టుబడిదారులు సరైన సమయాన్ని ఎంచుకుని అడుగు వేయాలి. లేకపోతే బంగారం చేజారిపోయిన అవకాశముంది!