గత కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుల మదిలో భయం కలిగించాయి. ధరలు మరింత పెరగడంతో బంగారం కొనాలా వద్దా అనే సందేహం ప్రజలను కలిగించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం, బంగారం ధరలు కాస్త తగ్గాయి. ఇవాళ ఏప్రిల్ 05 న హైదరాబాద్, విజయవాడలో 24, 22 క్యారెట్ల బంగారం ధరలు కాస్త తగ్గాయి.
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు వరుసగా పెరుగుతూ ఉండగా, ఏప్రిల్ మొదటి వారంలో బాగా పెరిగాయి. నిన్న ఏప్రిల్ 4న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.91640గా ఉండగా, ఈ రోజు అది రూ.90660కి తగ్గింది, అంటే 980 రూపాయలు తగ్గింది.
ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.84,000 నుంచి రూ.83,100కి తగ్గింది, అంటే 900 రూపాయలు తగ్గింది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.67990 కి తగ్గింది. ఇదిలా ఉండగా, పెళ్లి సీజన్ ఉండటంతో కొందరు బంగారం కొనడం మానలేకపోతున్నారు. మొత్తానికి, బంగారం ధరల తగ్గింపు పసిడి ప్రియులకు ఒక ఊరట కలిగించింది.