Google Alphabet Q3 2025 : టెక్ దిగ్గజం గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ మరోసారి చరిత్ర సృష్టించింది. 2025 మూడో త్రైమాసికం (Q3)లో తొలిసారిగా 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8.80 లక్షల కోట్లు) ఆదాయాన్ని సాధించి, అన్ని విభాగాల్లో రెండంకెల వృద్ధి నమోదు చేసింది.
సీఈఓ సుందర్ పిచాయ్, “ఏఐ టెక్నాలజీ మా అభివృద్ధి ఇంజన్. జెమినీ యాప్‌కు నెలవారీ 650 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు, ప్రశ్నలు మూడు రెట్లు పెరిగాయి” అని ప్రకటించారు. ఈ ఫలితాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఆల్ఫాబెట్ స్టాక్ 5% పెరిగి, మార్కెట్ విలువ 2 ట్రిలియన్ డాలర్లకు చేరింది అని తెలిపారు.
గూగుల్ సర్వీసెస్ ఆదాయం 14% పెరిగి 87 బిలియన్ డాలర్లు చేరింది. సెర్చ్ విభాగం 15% వృద్ధితో రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో బలం చూపింది. ఏఐ మోడ్‌తో ప్రపంచవ్యాప్తంగా 40 భాషల్లో 75 మిలియన్ యూజర్లు చేరారు. యూట్యూబ్ ప్రకటనలు 15% పెరిగి, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్లు 300 మిలియన్లు దాటాయి. క్లౌడ్ విభాగం అద్భుతం చేసింది. 35% వృద్ధితో 11 బిలియన్ డాలర్లు సాధించి, బ్యాక్‌లాగ్ 46% పెరిగి 155 బిలియన్ డాలర్లకు చేరింది. పిచాయ్, “క్లౌడ్ AI డిమాండ్ ఎక్కువ. గత క్వార్టర్‌తో పోలిస్తే ఏఐ ఆదాయం రెట్టింపు అయింది” అన్నారు.
ఏఐ ప్లేట్‌ఫామ్ జెమినీ మల్టీమోడల్ కెపాబిలిటీలతో (టెక్స్ట్, ఇమేజ్, వీడియో) యూజర్ ఎంగేజ్‌మెంట్ పెంచింది. గూగుల్ వన్ స్టోరేజ్, ఫీచర్లతో 300 మిలియన్ సబ్‌స్క్రైబర్లు. యూట్యూబ్ షార్ట్స్ వీడియోలు, AI ఎడిటింగ్ టూల్స్‌తో ప్రకటన రెవెన్యూ పెరిగింది. ఆల్ఫాబెట్ మొత్తం ఆదాయం 2024 Q3తో పోలిస్తే 18% పెరిగింది. లాభాలు 26.3 బిలియన్ డాలర్లు, EPS 2.12 (అంచనా 1.85 కంటే ఎక్కువ). కానీ, ఏఐ పెట్టుబడులు (75 బిలియన్ డాలర్లు) వల్ల ఓపరేటింగ్ ఖర్చులు 15% పెరిగాయి.
పిచాయ్, “ఏఐ మా భవిష్యత్తు. జెమినీ 2.0తో మరిన్ని ఇన్నోవేషన్లు వస్తాయి” అన్నారు. అనలిస్టులు, “ఏఐ మోనిటైజేషన్‌తో ఆల్ఫాబెట్ మార్కెట్ లీడర్‌గా మారుతోంది” అంటున్నారు. మైక్రోసాఫ్ట్, అమెజాన్‌తో పోటీలో గూగుల్ ముందుంది. Q4కు 105-110 బిలియన్ ఆదాయం అంచనా. ఈ ఫలితాలు టెక్ సెక్టార్‌లో ఉత్సాహాన్ని మేల్కొలిపాయి.


