Wednesday, January 8, 2025
Homeటెక్ ప్లస్Navigation App: గూగుల్ మ్యాప్‌తో రాంగ్ డైరెక్షన్స్ ఫాలో అవుతున్నారా.. ఈ బెస్ట్ యాప్ ట్రై...

Navigation App: గూగుల్ మ్యాప్‌తో రాంగ్ డైరెక్షన్స్ ఫాలో అవుతున్నారా.. ఈ బెస్ట్ యాప్ ట్రై చేయండి..

గూగుల్ మ్యాప్ ప్రపంచవ్యాప్తంగా ప్రదేశాలు, మార్గాలు, రోడ్లు, ట్రాఫిక్, వ్యాపారాలు, ఇతర స్థానిక సమాచారాన్ని అందిస్తుంది. ఇది యూజర్లకు సాధారణంగా రియల్ టైం మార్గదర్శకాలు, ట్రాఫిక్ పరిస్థితులు, మార్గాల మార్పులు, ప్రయాణ సమయాలను సూచిస్తుంది. గూగుల్ మ్యాప్‌లు, పేపర్ మ్యాప్‌లను బదులుగా ఉపయోగించడానికి సులభంగా యాక్సెస్ చేయగలిగిన ప్లాట్‌ఫారమ్. ఇది పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మార్గాలను, నడక మార్గాలను, సైక్లింగ్ మార్గాలను అందిస్తుంది. ప్రస్తుతం, గూగుల్ మ్యాప్‌ను వృద్ధి చేయడంలో అనేక భాషలలో అందుబాటులో ఉంచడంలో అత్యంత ప్రయోజనకరమైన యాప్‌గా భావిస్తున్నారు. కానీ ఇటీవల జరిగిన ఒక ఆక్సిడెండ్ వల్ల గూగుల్ మాప్ మీద చాలా మందికి ఈ యాప్‌పై నమ్మకం పోయింది.

- Advertisement -

గూగుల్ మ్యాప్స్ తప్పు నావిగేషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఇవి ప్రాణనష్టం కలిగించాయి. ఈ నేపథ్యంలో, మనం అయితే గూగుల్ మ్యాప్స్ వాడాలి లేదా మన భారతీయ నావిగేషన్ యాప్‌ను ఉపయోగించాలి. భారతదేశంలో ఉన్న “Mappls MapmyIndia” యాప్‌ను మీరు గూగుల్ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. ఈ యాప్ భారతదేశంలోని రోడ్లు, ట్రాఫిక్, హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, స్థానిక రోడ్ల గురించి మెరుగైన అవగాహన కలిగి ఉంది. దీనిలో డేటా అప్‌డేట్‌లు బాగా ఉంటాయి.

ఈ యాప్ అనేక భారతీయ భాషలలో పనిచేస్తుంది, ఇది ప్రజలకు మరింత సౌకర్యాన్ని కలిగిస్తుంది. ఈ యాప్ ప్రత్యేకత ఏమిటంటే, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకోవడం, రహదారుల నిర్మాణ పనులు, గుంతలు, టోల్ ప్లాజాలు, పెట్రోల్ పంపులు, ఏటీఎంల వంటి సమాచారాన్ని అందించడం. ఈ యాప్ “నేవిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్” (నావిక్) అనే భారతీయ శాటిలైట్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది, ఇది గూగుల్ మ్యాప్స్‌కు బదులుగా మంచి, నమ్మకమైన నావిగేషన్ సేవలను అందిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News