Google Pixel 9 Pro XL Discount: ఫ్లాగ్‌షిప్ కెమెరా డివైస్ కోసం చూస్తున్నారా? అయితే, గూగుల్ పిక్సెల్ డివైస్ ఉత్తమ ఎంపిక కావచ్చు. పిక్సెల్ 9 ప్రో XL డివైస్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో చాలా చౌకగా అందుబాటులో ఉంది. దీని ధర దాదాపు రూ. 20,000 తగ్గింది. త్వరలో గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ లాంచ్ నేపథ్యంలో ఇది తక్కువ ధరకు అందుబాటులో ఉంది. కంపెనీ గత సంవత్సరం పిక్సెల్ 9 ప్రో XL ఎక్స్‌ఎల్‌ను రూ. 1,24,999కి లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ హ్యాండ్‌సెట్ గొప్ప హార్డ్‌వేర్‌ను అందించడమే కాకుండా క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని కూడా అందిస్తుంది. ఇది మాత్రమే కాదు..ఈ ఫోన్‌లో చాలా గొప్ప AI ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ పరికరానికి సంబంధించి ఆఫర్, ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం.
Google Pixel 9 Pro XL డిస్కౌంట్ ఆఫర్:
పిక్సెల్ 9 ప్రో XL ఎక్స్‌ఎల్ అసలు ధర రూ. 1,24,999. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 20,000 తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఆ తర్వాత దీని ధర కేవలం రూ. 1,04,999కే కొనుగోలు చేయొచ్చు. దీనితో పాటు, కంపెనీ అదనపు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ద్వారా ఈ ఫోన్‌పై రూ. 10,000 తగ్గింపును అందిస్తోంది. ఇది మాత్రమే కాకుండా..ఈ ఫోన్‌పై ప్రత్యేక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. పాత పరికరంపై రూ. 72,000 వరకు ఎక్స్ఛేంజ్ విలువను పొందవచ్చు. అయితే పాత ఫోన్ కండిషన్, బ్రాండ్ పై ఆధారపడి ఉంటుంది. బ్యాంక్, ఫ్లాట్ డిస్కౌంట్‌తో ఫోన్‌పై మొత్తం 30 వేల తగ్గింపు ఇవ్వబడుతోంది.
Also Read: Swiggy Instamart : ఇకపై స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ లో ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయవచ్చు..
Google Pixel 9 Pro XL స్పెసిఫికేషన్లు:
ఈ పరికరం 6.7-అంగుళాల LTPO OLED డిస్ప్లేను కలిగి ఉంది. అలాగే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR మద్దతును కలిగి ఉంది. ఈ పరికరం 3000 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశాన్ని కూడా పొందుతుంది. స్క్రీన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణను పొందుతుంది. ఈ ఫోన్‌కు శక్తినివ్వడానికి, ఇది గూగుల్ టెన్సర్ G4 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇక ఫోటోగ్రఫీ ప్రియుల కోసం.. ఈ పరికరం వెనుక భాగంలో ట్రిపుల్-కెమెరా సెటప్ ఉంది. ఈ పరికరం OISతో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 48MP టెలిఫోటో కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం..ఈ పరికరంలో 42MP కెమెరా ఉంది. ఈ ఫోన్ 5060mAh బిగ్ బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి


