Saturday, November 15, 2025
Homeటెక్నాలజీGoogle Pixel 9: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్.. సగం ధరకే గూగుల్ పిక్సెల్ 9..

Google Pixel 9: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్.. సగం ధరకే గూగుల్ పిక్సెల్ 9..

Google Pixel 9 Discount: గూగుల్ పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు సగం కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. గూగుల్ ఈ ప్రీమియం ఫోన్‌ను రాబోయే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంచుతుంది. అయితే తాజాగా, ఈ-కామర్స్ ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ డీల్‌ను వెల్లడించింది. గూగుల్ పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్ గత సంవత్సరం రూ.79,999కు మార్కెట్లో పరిచయం అయినా విషయం తెలిసిందే. కాగా, ఈ సేల్ లో భాగంగా ఇది రానున్న బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ.35,000 చౌకగా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

- Advertisement -

సెప్టెంబర్ 23 నుండి ఫ్లిప్ కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభమవుతోంది. ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న ఫోన్‌ల డీల్‌లను ఈ-కామర్స్ వెబ్‌సైట్ క్రమంగా వెల్లడించడం ప్రారంభించింది. ఫ్లిప్ కార్ట్ లో ప్రారంభమయ్యే ఈ సేల్‌లో కంపెనీ పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ ను రూ.34,999 ప్రారంభ ధరకు జాబితా చేసింది.

Also Read:Flipkart Big Billion Days Sale 2025: బంపర్ ఆఫర్..ఈ ఐఫోన్ మోడళ్లపై ఏకంగా రూ.55 వేలు డిస్కౌంట్..!!

గూగుల్ పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల గురించి మాట్లాడితే, ఇది 6.3-అంగుళాల యాక్టువా OLED డిస్ప్లేను కలిగి ఉంది. ఫోన్ డిస్ప్లే 120Hz అధిక రిఫ్రెష్ రేట్, 1800 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశాన్ని సపోర్ట్ చేస్తుంది. గూగుల్ పిక్సెల్ 9 డిస్ప్లేలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఇచ్చారు. ఈ ఫోన్ టెన్సర్ G4 ప్రాసెసర్‌లో పనిచేస్తుంది. దీనికి 12GB RAMతో 256GB నిల్వ మద్దతు లభిస్తుంది. ఇక భద్రత కోసం ఇది టైటాన్ M2 చిప్‌ను కలిగి ఉంది.

ఈ ప్రీమియం ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 50MP ఆక్టా ఫేజ్ డివిజన్ కెమెరా ఉంది. దీనితో 48MP సెకండరీ కెమెరా అందుబాటులో ఉంటుంది. గూగుల్ ప్రీమియం ఫోన్‌లో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 10.5MP కెమెరా ఉంది. గూగుల్ జెమిని AI తో అమర్చబడిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే,ఇది 4700mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా అందించారు. కనెక్టివిటీ కోసం, ఈ గూగుల్ ఫోన్‌లో తాజా వైఫై, బ్లూటూత్, NFC వంటి ఫీచర్లు ఉన్నాయి.

నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad