Sunday, November 16, 2025
Homeటెక్నాలజీWaterproof: మీరు కొనే స్మార్ట్​ఫోన్​ ‘వాటర్​ప్రూఫ్​’ అని చెబితే నమ్మేస్తున్నారా..?

Waterproof: మీరు కొనే స్మార్ట్​ఫోన్​ ‘వాటర్​ప్రూఫ్​’ అని చెబితే నమ్మేస్తున్నారా..?

Waterproof Phone: అనేక స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు తమ గ్యాడ్జెట్స్ వాటర్ ప్రూఫ్ అంటూ కస్టమర్లకు సేల్ చేస్తున్నాయి. దీంతో చాలామంది అవి ఏ ప్రమాదం నుంచైనా సురక్షితమని కొనుగోలు చేస్తున్నాం. అనుకోకుండా నీటిలో పడిపోయిన, వర్షంలో తడిసిపోయిన ఐపి 68 లేబుల్ మన పరికరానికి రక్షణ కల్పిస్తుందని నమ్ముతున్నాము. అయితే మనం అనుకుంటున్న సేఫ్టీ కొద్దికాలం మాత్రమే పని చేస్తుందంటే నమ్మవచ్చా?

- Advertisement -

స్మార్ట్ ఫోన్ కు ఉండే వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ పరికరం జీవితకాలం గ్యారెంటీ కాదని గూగుల్ దృవీకరించింది. గూగుల్ తన తాజా సపోర్ట్ పేజీలో ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపింది. సాధారణంగా ఫోన్ ను ఉపయోగించడం వల్ల ఐపీ68 రక్షణ తగ్గిపోవచ్చు. దీని అర్థం ఫోన్ కు తగిలే ప్రతి చిన్న దెబ్బ, పగిలిన చిన్న భాగం, రోజువారి ఉపయోగం వల్ల క్రమంగా వాటర్ అండ్ బెస్ట్ నుంచి రక్షణ కల్పించే దాన్ని సామర్థ్యం తగ్గిపోతుంది.

Also read: Realme p4 pro 5g: రియల్‌మీ స్పెషల్ సేల్.. 12 గంటల వరకే ఛాన్స్..

ఐపీ68 అనేది వాటర్, డస్ట్ అసిస్టెంట్ ని సూచించే సంఖ్య. ఇది మొబైల్ మార్కెట్లో వినిపించే ప్రసిద్ధ పదం. ఈ సంఖ్య ప్రకారం.. ఫోన్ దాదాపు అరగంట పాటు 1.5 మీటర్ల లోతు నీటిలో ఉన్న పాడవకుండా ఉండాలి. ఇది వినడానికి బాగున్న, చాలామందికి తెలియని విషయం ఏంటంటే? ఈ ఫోన్ నియంత్రించిన ల్యాబ్ పరిస్థితుల్లో కొత్తగా ఉన్నప్పుడు మాత్రమే ఈ నెంబర్ ను పరీక్షిస్తారు. మనం పరికరాన్ని రోజు వాడడం వల్ల నీటిని అడ్డుకునే సీల్స్, అతుకులు నెమ్మదిగా పాడవుతాయి. స్మార్ట్ ఫోన్ ను ఎన్నిసార్లు డబ్బున్న జేబులో పెడితే, ఎన్నిసార్లు కింద పడితే, రోజువారీగా ఎక్కువ వాడితే నీటిని అడ్డుకునే పొరలు త్వరగా బలహీనపడతాయి.

నిజానికి స్మార్ట్ ఫోన్ ఒక్కసారి నీటిలో పడితే, దానికి ఏమి కాకపోవచ్చు. కానీ నెలలు, సంవత్సరాలు తర్వాత నీటిని అడ్డుకునే సీల్స్ బలహీనపడి రక్షణ ఇవ్వలేకపోవచ్చు. దీనివల్ల వారంటీలు కూడా సమస్యగా మారుతాయి. అనేక కంపెనీల వారంటీలు, ఏదైనా సీల్ అరిగిపోయినట్లు గుర్తిస్తే వాటర్ డామేజ్ ను కవర్ చేయవు. స్మార్ట్ తయారీదారులు మార్కెటింగ్ లో ప్రచారం చేస్తున్నప్పటికీ, వాటర్-డస్ట్ రెసిస్టెన్స్ అనేది కేవలం ఫోన్ కు ఒక బ్యాకప్ సేఫ్టీ మాత్రమేనని, ఎక్స్పరిమెంట్లు చేయడానికి అనుమతి కాదని నిపుణులు చెబుతున్నారు.

ఈ క్రమంలో వినియోగదారులు ఐపీ68 ఉన్న ఫోన్ ను కొత్తగా ఉన్నప్పుడు స్ప్లాష్ దుర్గ పరిగణించాలి. పరికరం పాతబడే కొద్దీ జాగ్రత్తగా వాడాలి. ఫోన్ కు జీవితాంతం వాటర్, డస్ట్ నుంచి రక్షణ ఉంటుందని అనుకోకూడదు. పరికరానికి వాటర్ ప్రూఫ్ కేసు అవసరం అనుకుంటే వాడాలి. వాటర్ ప్రూఫ్ కదా అని అనవసరంగా పరికరాన్ని నీటిలో ముంచకూడదు. సాధ్యమైనంతవరకు దుమ్ము, నీరు తగలకుండా చూసుకోవాలి.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad