Google Watch 4 Sale: ఈ సంవత్సరం ఆగస్టులో గూగుల్ తన తాజా స్మార్ట్‌వాచ్, పిక్సెల్ వాచ్ 4 ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా భారత్ లో ఈ స్మార్ట్ వాచ్ సేల్ ప్రారంభమైంది. అంటే, దాదాపు విడుదలైన దాదాపు మూడు నెలల తర్వాత ఇండియాలో దీని సేల్స్ ప్రారంభమయ్యాయి. ఈ వాచ్ శక్తివంతమైన ఫీచర్లతో వస్తుంది. ఇది SpO2, ECG, చర్మ ఉష్ణోగ్రత వంటి ఆరోగ్య ఫీచర్లను అందిస్తుంది. అంతేకాదు, ఇది అనేక ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్‌లను సైతం అందిస్తుంది. ఇప్పుడు ఈ వాచ్ ధర, ఫీచర్ల గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
ధరెంత
గూగుల్ పిక్సెల్ వాచ్ 4 ధర 41mm సైజు, Wi-Fi వెర్షన్ కోసం ర్.39,900 నుండి ప్రారంభమవుతుంది. ఇక 45mm వేరియంట్ ధర రూ.43,900. ఈ వాచ్‌ను గూగుల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ వాచ్ త్వరలో ఫ్లిప్ కార్ట్, ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో రావచ్చు. పిక్సెల్ వాచ్ 4 అనేక బ్యాండ్‌ల ఎంపికతో వస్తుంది. ఇది అవసరాలకు బాగా సరిపోయే బ్యాండ్‌ను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.
ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే..గూగుల్ పిక్సెల్ వాచ్ 4 లో ఆల్వేస్ ఆన్ ఫీచర్ తో 3D కర్వ్డ్ అమోలేడ్ డిస్ప్లే కలిగి ఉంది. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం.. ఇది గొరిల్లా గ్లాస్ 5 ద్వారా రక్షణ పొందుతుంది. డిస్ప్లే గరిష్ట ప్రకాశం 3000 నిట్స్. కంపెనీ ప్రకారం..ఈ పరికరం 100% రీసైకిల్ చేసిన అల్యూమినియంను ఉపయోగిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ W5 జెన్ 2 ప్రాసెసర్‌తో వస్తుంది. Wear OS 6 పై నడుస్తుంది. ఇది 32GB నిల్వ స్టోరేజీ, 2GB ర్యామ్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్‌లో దిక్సూచి, హార్ట్ బీట్ రేట్, ఇతర సెన్సార్లు ఉన్నాయి. ఇది స్లీప్ స్కోర్, కార్డియో లోడ్, టార్గెట్ లోడ్, 40 కంటే ఎక్కువ వర్కౌట్ మోడ్‌లను అందిస్తుంది.
ఈ వాచ్‌లో అంతర్నిర్మిత మైక్రోఫోన్, స్పీకర్ ఉన్నాయి. ఈ పరికరం 4G LTE, బ్లూటూత్ 5.3, GPS, శాటిలైట్ SOS కమ్యూనికేషన్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఇక బ్యాటరీ గురించి మాట్లాడితే..41mm వేరియంట్ 325mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. అయితే 45mm వేరియంట్ 455mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది వేగవంతమైన USB టైప్-C ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.


