Flipkart Freedom Sale: ఈ నెల మొదట్లో ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సేల్ ఆగస్టు 7 వరకు కొనసాగింది. ఈ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు అనేక స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లు అందించింది. ఇదే సమయంలో ఫ్లిప్‌కార్ట్ మరోసారి ఫ్రీడమ్ సేల్‌తో తిరిగి వచ్చింది. ఈసారి ఫ్లిప్‌కార్ట్ కొనుగోలుదారుల కోసం స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్‌లతో పాటు మరిన్ని గొప్ప ఆఫర్‌లను తీసుకొచ్చింది. ఈ ఆఫర్లలో భాగంగా ఐదు స్మార్ట్ ఫోన్స్ పై అదిరే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని కంపెనీ తన ప్లాట్‌ఫామ్‌లోని టాప్ డీల్స్‌లో కూడా చేర్చింది. ఈ జాబితాలో శామ్‌సంగ్, రియల్‌మీ, ఐఫోన్ 16, పోకో వంటి గొప్ప పరికరాలు ఉండటం విశేషం.
Samsung Galaxy S24 FE
జాబితాలో మొదటి స్మార్ట్ ఫోన్.. శామ్‌సంగ్ గెలాక్సీ S24 FE మోడల్. ఈ ఫోన్ ఎక్సినోస్ 2400 ప్రాసెసర్‌తో అనేక AI ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ 4500mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ట్రిపుల్ రియల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ పరికరం ప్రస్తుతం రూ. 34,999కి కొనుగోలుకు అందుబాటులో ఉంది.
iPhone 16
ఈ జాబితాలో రెండవ ఫోన్ ఆపిల్ ఐఫోన్ 16. ఇందులో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేను పొందుతారు. ఈ పరికరం తాజా A18 బయోనిక్ చిప్ తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే ఇది 48-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ పరికరం మృదువైన పనితీరుతో పాటు, ఫోన్ అద్భుతమైన వీడియో నాణ్యతను కూడా అందిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను కేవలం రూ.67,499 కు కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా కొనుగోలుదారులు ఈ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్లు కూడా పొందొచ్చు.
Also Read: BSF Recruitment : BSFలో 3,829 కానిస్టేబుల్ ఉద్యోగాలు..
Samsung Galaxy S24
శామ్‌సంగ్ గెలాక్సీ S24 పరికరంలో Exynos 2400 ప్రాసెసర్‌ను చూడవచ్చు. దీనితో పాటు, ఈ పరికరం 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 30x స్పేస్ జామ్ ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ప్రస్తుతం దీని కేవలం రూ. 43,999 కు కొనుగోలు చేయవచ్చు.
POCO F7 5G
పోకో F7 5G స్మార్ట్ ఫోన్ ఇటీవల మార్కెట్లో రిలీజ్ అయింది. ఈ పరికరం 7,550mAh బిగ్ బ్యాటరీతో వస్తుండటం విశేషం. దీనితో పాటు ఈ పరికరంలో 50 మెగాపిక్సెల్ రియల్ కెమెరా, 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఫోన్ 6.83 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. బ్యాంక్ ఆఫర్‌ల తర్వాత ఈ ఫోన్‌ను సేల్‌లో కేవలం రూ.29,999కి సొంతం చేసుకోవచ్చు.
Realme GT 6
ఈ జాబితాలోని చివరి ఫోన్ రియల్‌మీ జిటి 6 స్మార్ట్ ఫోన్. ఇందులో తయారీదారులు స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్3 చిప్‌సెట్‌ను అమర్చారు. దీనితో పాటు, ఫోన్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఇచ్చారు. ఈ పరికరం 5,500mAh బిగ్ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. ఈ సేల్స్ భాగంగా ఈ పరికరాన్ని కేవలం రూ.27,499కి కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ ధర బ్యాంక్ ఆఫర్‌ల తర్వాత అందుబాటులో ఉంటుంది.

