Wednesday, January 14, 2026
Homeటెక్నాలజీGrok Chatbot: అసభ్యకర కంటెంట్ వివాదం.. గ్రోక్‌ చాట్‌బాట్‌పై 'X' పరిమితులు

Grok Chatbot: అసభ్యకర కంటెంట్ వివాదం.. గ్రోక్‌ చాట్‌బాట్‌పై ‘X’ పరిమితులు

Grok Chatbot Elon Musk: ఏఐ చాట్‌బాట్‌ గ్రోక్‌ను చట్టవిరుద్ధ కంటెంట్, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర చిత్రాల సృష్టికి దుర్వినియోగం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ‘X’ అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మస్క్‌ తాజాగా చర్యలు కూడా చేపట్టారు. గ్రోక్‌ చాట్‌బాట్‌లోని ఇమేజ్‌ జనరేషన్ ఫీచర్‌పై పరిమితులు విధించారు. అంతేకాకుండా ఈ ఫీచర్‌ కేవలం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. 

- Advertisement -

అశ్లీల, అసభ్యకర దృశ్యాల రూపకల్పనకు ‘X’ ఏఐ చాట్‌బాట్‌ గ్రోక్‌ను దుర్వినియోగం చేస్తున్నారని ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళన వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీనిపై ప్రముఖ రాజకీయ నేతల నుంచి కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు సైతం వెల్లువెత్తాయి. దీంతో అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించాలని ‘X’ను మంత్రిత్వ శాఖ ఆదేశించింది. భారత్‌తో పాటు పలు దేశాలు గ్రోక్‌ చాట్‌బాట్‌ దుర్వినియోగంపై మండిపడ్డాయి. ఈ క్రమంలో దీనిపై ఇటీవల స్పందించిన సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌.. గ్రోక్‌ను దుర్వినియోగం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని యూజర్లను హెచ్చరించారు. అందుకు అనుగుణంగా తాజాగా చర్యలు చేపట్టారు. 

Also Read: https://teluguprabha.net/cinema-news/why-are-there-three-heroines-in-the-rajasaab/

ఇకపై గ్రోక్‌ చాట్‌బాట్‌ అసభ్యకర కంటెంట్‌ను నిలువరించేలా ‘X’ చర్యలు చేపట్టింది. ఇందులోని ఇమేజ్‌ జనరేషన్‌ ఫీచర్‌పై పరిమితులు విధించింది. కేవలం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అయితే ఈ ఫీచర్‌ను అన్‌లాక్‌ చేసుకోవడానికి సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చని పేర్కొంది. కాగా, గ్రోక్ సబ్‌స్క్రైబర్ సంఖ్య.. ప్రస్తుతం బహిరంగంగా అందుబాటులో లేనప్పటికీ, గతంతో పోలిస్తే.. డీప్‌ఫేక్‌ల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. 

కాగా, గ్రోక్‌ చాట్‌బాట్‌ దుర్వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గ్రోక్‌ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని యూరోపియన్‌ యూనియన్‌ ఆరోపించింది. ఇక, ఫ్రాన్స్‌, భారత్‌, మలేసియా, బ్రెజిల్‌ దేశాలు దర్యాప్తునకు పిలుపునిచ్చాయి. గ్రోక్‌లో అశ్లీల కంటెంట్‌కు నిరసనగా ‘X’పై చర్యలు తీసుకుంటామని బ్రిటన్‌ హెచ్చరించింది. 

Also Read: https://teluguprabha.net/technology-news/best-camera-phones-in-budget-price/

గ్రోక్ చాట్‌బాట్‌ను సంస్థ 2023లో ప్రారంభించింది. గతేడాది.. గ్రోక్ Imagine అనే ‘ఇమేజ్ జనరేషన్‌ ఫీచర్‌’ను జోడించింది. ఇందులో అడల్ట్ కంటెంట్‌ను జనరేట్ చేసేలా “స్పైసీ మోడ్” ఆప్షన్‌ ఉంది. అయితే చాట్‌బాట్‌ ప్రత్యర్థులకు పోటీగా గ్రోక్‌ను నిలబెట్టేందుకు గ్రోక్‌లో క్రియేట్‌ చేసిన చిత్రాలు బహిరంగంగా కనిపిస్తాయి. దీంతో ఇవి సులభంగా నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. దీంతో ఇతరుల వ్యక్తిగత భద్రతకు, ప్రతిష్ఠకు భంగం కలుగుతోంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News