Saturday, April 19, 2025
Homeటెక్ ప్లస్UPI GST: UPI పేమెంట్స్‌పై జీఎస్టీ.. కేంద్రం క్లారిటీ

UPI GST: UPI పేమెంట్స్‌పై జీఎస్టీ.. కేంద్రం క్లారిటీ

రూ. 2వేల కన్నా ఎక్కువ UPI లావాదేవీలపై GST విధించాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతన్నాయి. దీంతో యూజర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించింది. ఈ వార్తలు పూర్తి అబద్ధమని తేల్చి పారేసింది. ప్రస్తుతం కేంద్రం వద్ద ఇలాంటి ప్రతిపాదన ఏదీ లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో క్లారిటీ ఇచ్చింది. పేమెంట్ గేట్‌వే లేదా ఇతర మార్గాల ద్వారా విధించే సేవా రుసుముకు సంబంధించిన ఛార్జీలపై మాత్రమే జీఎస్టీ విధిస్తామని స్పష్టం చేసింది. అయితే జనవరి 2020 నుంచి వ్యక్తి – మర్చంట్ యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ తొలగించింది. డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపింది.

- Advertisement -

కాగా UPI ప్రోత్సాహక పథకం 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తోంది. తక్కువ మొత్తంలో P2M లావాదేవీలను ప్రోత్సహిస్తుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,389 కోట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,210 కోట్లు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,631 కోట్లుగా పేర్కొంది. యూపీఐ లావాదేవీలు 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 21.3 లక్షల కోట్ల నుంచి మార్చి 2025 నాటికి రూ. 260.56 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ACI వరల్డ్‌వైడ్ రిపోర్ట్ 2024 ప్రకారం.. 2023లో ప్రపంచంలోని మొత్తం రియల్-టైమ్ లావాదేవీలలో భారత్ 49శాతం వాటాను కలిగి ఉంది. దీంతో డిజిటల్ చెల్లింపుల రంగంలో భారత్ ప్రపంచ అగ్రస్థానంలో పేరు దక్కించుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News