నిద్ర లేచింది మెుదలు..రాత్రి పడుకునే వరకు రీల్స్ రీల్స్( Reels).. ఇవి చూస్తూనే కొంత మంది కాలక్షేపం చేస్తుంటే.. కొంత మంది అందర్నీ ఆకట్టుకోవాలని.. మంచి వ్యూస్ తో తమ వీడియోలు వైరల్ (videos viral) కావాలని తెగ ఆరాటపడుతుంటారు. ఈ మధ్య ఇది చాలా ఫ్యాషన్( fashion) అయింది. రీల్స్ (reels) చేస్తూ సంపాదించే వారు కొందరైతే… మరి కొంతమంది.. తమ పిచ్చి చేష్టలతో అందరికి పిచ్చి పట్టిస్తుంటారు. ఇలాంటి కోవకే చెందిన వాడే ఈ వ్యక్తి.
వీడి పిచ్చి తగిలెయ్యా.. ఏం చేశాడో చూడండి. తన వీడియోస్ వైరల్ కావాలని ఏకంగా మూతికి గమ్ (gum) అంటించుకుని రీల్స్(reels) చేద్దామని చూశాడు. అనుకున్నట్లే గమ్ (gum) వేసి అంటించుకున్నాడు. ఇంకేముంది.. రీల్స్ మాత్రం చేశాడు కానీ నోరు మాత్రం తెరుచుకోలేదు. ఈ విచిత్ర ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ అన్ని సోషల్ మీడియాల్లో మాత్రం తెగ వైరల్ అవుతుంది. రీల్ అయితే శుభ్రంగా చేశాడు కానీ… తను మాత్రం చిక్కుల్లో పడ్డాడు. మూతికి అంటించుకున్న గమ్ రాక.. ఓ అంటూ ఏడవసాగాడు. కంటికి నీళ్లు అయితే వచ్చాయి కానీ… పాపం నోరే మెదపలేకపోయాడు.
ఈ రీల్స్ పిచ్చోడు.. డిఫరెంట్ గా ట్రై చేసినట్టుంది. ఈ యువకుడి ఇన్స్టాగ్రామ్ (INSTAGRAM) పరిశీలిస్తే స్నేహితులను, తెలియని వారిని కూడా సరదాగా ఆట పట్టించే హ్యబీట్ ఉందని తెలుస్తుంది. ఏదైతేనేమీ మెుత్తానికి అనుకున్నది అయితే చేశాడు. కానీ ఇబ్బందుల్లో పడ్డాడు. తర్వాత తన పెదవులు ఓపెన్ అయ్యాయో లేదా తెలియదు. దీనిపై ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. ఇప్పుడు ఈ రీల్ అన్ని సోషల్ మీడియా (socialmedia)లో తెగ వైరల్ (viral) అవుతుండటంతో నెటిజన్స్ ఓ కామెంట్స్ (comments) పెట్టి నవ్వుకుంటున్నారు. మరి మీరు ఈ వీడియో చూడాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.
https://www.instagram.com/reel/DEzDgivhR_h/?igsh=NDdocjhzbzI3M2ly