Headphones under rs 5000 available in market: ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో రూ. 5 వేలలోపు వైర్ లెస్ హెడ్ ఫోన్స్ హల్‌చల్ చేస్తున్నాయి. వాటిలో జేబీఎల్, సోనీ, బోట్, నాయిస్, బౌల్ట్ లాంటి బ్రాండ్లు రూ. 5 వేలలోపు హెడ్‌ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆక్టివ్ నాయిజ్ క్యాన్సలేషన్, 40 గంటలకు పైగా బ్యాటరీ, బ్లూటూత్ 5.0+ కనెక్టివిటీ, డీప్ బేస్ లాంటి ఫీచర్లతో ఈ కొత్త మోడల్స్‌ను అందిస్తున్నాయి. గేమింగ్, వర్కౌట్స్, డైలీ అవసరాలకు అనుగుణంగా వీటిని డిజైన్ చేశారు. రివ్యూలు, రేటింగ్స్, స్పెసిఫికేషన్ల ఆధారంగా టాప్ 5 ఓవర్ ఈర్ వైర్ లెస్ హెడ్ ఫోన్స్ గురించి తెలుసుకుందాం.
జేబీఎల్ ట్యూన్ 760NC రూ. 5 వేల లోపు బెస్ట్ వైర్ లెస్ హెడ్ ఫోన్స్ లో ఇది ఒకటి. రూ. 4499 ధర వద్ద అందుబాటులో ఉంది. 40mm డ్రైవర్స్, యాక్టివ్ నాయిజ్ క్యాన్సలేషన్, JBL ప్యూర్ బేస్ సౌండ్, Bluetooth 5.3, ఫోల్డబుల్ డిజైన్, ENC మైక్ ను కలిగి ఉంటుంది. ఒక్క ఛార్జ్ తో 50 గంటలు పని చేస్తుంది. 4.3/5 రేటింగ్ కలిగిన ఈ హెడ్ ఫోన్స్ మ్యూజిక్, ట్రావెలింగ్ కు అనుగుణంగా ఉంటుంది.సోనీ డబ్ల్యూహెచ్ సీహెచ్ 520 కేవలం రూ. 3999 ధర వద్ద లభిస్తోంది. ఈ హెడ్ ఫోన్స్ ఒక్క ఛార్జ్ తో 50 గంటలు పని చేస్తుంది. 30mm డ్రైవర్స్, డిజిటల్ సౌండ్ ఎన్‌హాన్స్ మెంట్, Bluetooth 5.2, లైట్‌వెయిట్, యాప్ సపోర్ట్ ఉంటుంది. 4.2/5 రేటింగ్ తో డైలీ కమ్యూట్, కాల్స్ కు అనుగుణంగా ఉంటుంది.బోట్ రాకర్జ్ 551 ఏఎన్‌సీ ప్రో హెడ్‌ఫోన్స్ రూ. 2999 ధర వద్ల లభిస్తాయి. ఒక్క ఛార్జ్ మీద 100 గంటలు పని చేస్తుంది. 40mm డ్రైవర్‌లు, 33dB ANC, సింక్ టెక్, Bluetooth 5.0, IPX5 స్వెట్ రెసిస్టెంట్ ను కలిగి ఉంటుంది. 4.1/5 రేటింగ్ తో లాంగ్ ప్లే బ్యాక్, వర్కౌట్స్ కు అనుకూలంగా ఉంటుంది.నాయిస్ ఎయిర్‌వేవ్ మ్యాక్స్ 5 హెడ్‌ఫోన్స్ రూ. 4999 ధర వద్ద లభిస్తుంది. రూ. 5 వేల లోపు బెస్ట్ హెడ్ ఫోన్స్ లో ఇది ఒకటి. 40mm డ్రైవర్స్, 50dB హైబ్రిడ్ ANC, అడాప్టివ్ EQ, Bluetooth 5.3, ఫాస్ట్ చార్జ్ సదుపాయంతో ఒక్క ఛార్జ్ తో 50 గంటలు పని చేస్తుంది. 4.2/5 రేటింగ్ తో నాయిజ్ ఫ్రీ ఆఫీస్, స్టడీకి అనుగుణంగా ఉంటుంది.బౌల్ట్ ఆడియా యాంకర్ హెడ్‌ఫోన్స్ రూ.1999 ధర వద్ద లభిస్తుంది. ఈ హెడ్ ఫోన్స్ ఒక్క ఛార్జ్ తో 30 గంటలకు పైగా పని చేస్తుంది. 40mm డ్రైవర్స్, డీప్ బేస్, Bluetooth 5.3, IPX5 వాటర్ ప్రూఫ్, ఫోల్డబుల్, వాయిస్ అసిస్టెంట్ ను కలిగి ఉంటుంది. 4.0/5 రేటింగ్ తో బడ్జెట్ యూజర్స్, ఔట్ డోర్ కు అనుగుణంగా ఉంటుంది.