POCO M6 Plus 5G Discount: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా..?అయితే, మీకో గుడ్ న్యూస్! 108MP కెమెరాతో కూడిన పోకో M6 ప్లస్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ పోకో ఫోన్ లాంచ్ ధర కంటే వేల రూపాయలు చౌకగా లభిస్తోంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ ను దాదాపు 36% వరకు తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు. దీనితో పాటు, ఫోన్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ పరికరానికి సంబంధించి ఆఫర్, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
POCO M6 Plus 5G ఆఫర్:
పోకో M6 ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ సమయంలో 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా, 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా మార్కెట్లో విడుదల చేసారు. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో ఆఫర్ లో భాగంగా దాదాపు 36% తగ్గింపు తర్వాత 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,080గా, 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,499గా జాబితా చేయబడింది. దీంతో పాటు, 5% క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్లపై ఇతర బ్యాంక్ ఆఫర్‌ల చూస్తే దీని టాప్ వేరియంట్‌ను రూ.405 ప్రారంభ EMIలో సొంతం చేసుకోవచ్చు.
POCO M6 Plus ఫీచర్లు:
ఈ పరికరం 6.79-అంగుళాల FHD + డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే 120Hz హై రిఫ్రెష్ రేట్ ఫీచర్‌కు మద్దతు ఇస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 AE ప్రాసెసర్‌ను పొందుతుంది. దీనితో 8GB వరకు RAM, 128GB వరకు నిల్వకు మద్దతు ఉంటుంది. ఈ ఫోన్ నిల్వను మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ 5030mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్‌ఓఎస్‌తో వస్తుంది. దీని వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫోన్‌లో 108MP ప్రధాన కెమెరా ఉంటుంది. దీనితో పాటు, వెనుక భాగంలో 2MP కెమెరా ఉంటుంది. ఈ ఫోన్‌లో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 13MP కెమెరా ఉంటుంది.


