HERO VIDA VX2 Launched: దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన విడా బ్రాండ్ కింద కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘విడా VX2’ను మార్కెట్లో విడుదల చేసింది. ఇది కంపెనీ విడా పోర్ట్‌ఫోలియోలో అత్యంత చౌకైన, అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్. కంపెనీ ఈ స్కూటర్‌ను VX2 Go, VX2 Plus అనే రెండు వేరియంట్‌లతో మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించి ధర, ఫీచర్ల గురుంచి వివరంగా తెలుసుకుందాం.
ధర
Hero VX2 Go వేరియంట్ ధర బ్యాటర్ సబ్‌స్క్రిప్షన్‌తో అయితే రూ. 59,490కి (ఎక్స్ షోరూమ్ ధర)గా, సబ్‌స్క్రిప్షన్ లేకుండా అయితే రూ. 99,490గా (ఎక్స్ షోరూమ్ ధర) కంపెనీ నిర్ణయించింది. ఇక ప్లస్ వేరియంట్ బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్‌తో అయితే రూ. 64,990(ఎక్స్ షోరూమ్ ధర)గా, సబ్‌స్క్రిప్షన్ లేకుండా రూ. 1.10 లక్షలుగా (ఎక్స్ షోరూమ్ ధర) కంపెనీ తెలిపింది.
రేంజ్
ఇక Hero VX2 Go వేరియంట్ బండిలో 2.2kWh సామర్థ్యం గల బ్యాటరీ ఉంది. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 92 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. మరోవైపు.. Hero VX2 ప్లస్ వేరియంట్ బండిలో కంపెనీ 3.4 kWh సామర్థ్యం గల బిగ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది ఒకే ఛార్జ్‌లో 142 కి.మీ వరకు రేంజ్‌ను ఇవ్వగలదు.
ఫీచర్లు
ఈ రెండు ఈ కొత్త తరహా ఎలక్ట్రిక్ స్కూటర్లలో 4.3-అంగుళాల TFT డిస్‌ప్లే అందుబాటులో ఉంది. విడా వీఎక్స్ 2 ఏడు రంగులలో ( బ్లూ, బ్లాక్, ఎల్లో, రెడ్, వైట్, ఆరెంజ్, యాష్) లభిస్తోంది. ఇక ప్లస్ వేరియంట్ స్కూటర్ మాత్రం రెండు రంగుల్లోనే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ రెండు వేరియంట్లలో టర్న్-బై-టర్న్ నావిగేషన్ సౌకర్యం అందించారు. ఈ విభాగంలో మొదటిసారిగా ఈ స్కూటర్లలో క్లౌడ్-ఆధారిత కనెక్టివిటీని కూడా అందిస్తున్నారు. వినియోగదారులు ఈ స్కూటర్లను తమ స్మార్ట్‌ఫోన్‌లకు సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై కంపెనీ 5 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల సమగ్ర వారంటీని కూడా అందిస్తోంది. ఈ స్కూటర్ బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో నేరుగా పోటీపడుతోంది.