కెమరా, కెమరా, కెమరా..ఇప్పుడు ఇది ప్రజలను వణికిస్తున్న అతిపెద్ద అస్త్రంగా మారిపోయంది. ఆఖరుకి పుణ్యస్నానం ఆచరించటానికి ప్రయాగరాజ్ లోని మహా కుంభమేళకు వెళ్లినా అక్కడ కూడా మహిళలు స్నానం చేసే ఫోటోలు, వీడియోలను అమ్మకానికి పెట్టేశారు. ఈ నేపథ్యంలో మాల్స్ లో ట్రయల్ రూమ్సే కాదు హోటల్ రూములు కూడా సేఫ్ కాదన్న భయం అందరినీ వేటాడుతోంది. ఒక్క మీ ఇల్లు కాక ఇంకేదీ మీకు సేఫ్ కాదు అనే అభద్రతా భావం వెంటాడేలా చేస్తోంది మూడో కన్నైన కెమరా.
ప్రైవసీకి భంగం, మరేం చేయాలి?
ఓ మహిళ హోటల్ రూము తీసుకుని కూడా హిడెన్ కెమరాలు ఉన్నాయేమో అన్న భయంతో చివరికి హోటల్ రూములోనే టెంట్ వేసుకుని బతకాల్సిన దుస్థితి దాపురించింది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ తంతు బహుశా హిడెన్ కెమరాలకు విరుగుడును సూచిస్తుందేమో అన్న కామెంట్స్ రాబడుతోంది. హోటల్ రూముల్లో ప్రైవసీకి భంగం వాటిల్లడాన్ని మనం తరచూ వింటూనే ఉంటాం. ముఖ్యంగా హనీమూన్ కపుల్ బాధ అయితే మాటల్లో చెప్పలేనంత ఘోరంగా హోటల్ రూములు తయారయ్యాయని, ఊటీ లాంటి చోట్ల ఇదో పెద్ద దందాగా మారిందని ఎప్పటినుంచో టూరిస్టులు మొత్తుకుంటూనే ఉన్నారు.
అన్ని దేశాల్లోనూ ఇదే దరిద్రం
మనదేశంలో మాత్రమే కాదు అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి దాపురించిందని టూరిస్టులు చెబుతున్నారు. తాజాగా ఓ మహిళ చైనాలోని హాస్పిటాలిటీ ఇండస్ట్రీ దరిద్రాలు తట్టుకోలేక తన వెంట తెచ్చుకున్న తాడు, పెద్ద గుడ్డను కలిసి ఇలా పరుపుపైనే టెంట్ లా వేసుకుని తన ప్రైవసీని కాపాడుకోవటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ గా మారింది.