Friday, December 12, 2025
Homeటెక్నాలజీHonor 500 Pro: గ్లోబల్‌ మార్కెట్‌లోకి హానర్ 500 ప్రో లాంచ్.. ఫీచర్లకు ఫిదా అవ్వాల్సిందే..!

Honor 500 Pro: గ్లోబల్‌ మార్కెట్‌లోకి హానర్ 500 ప్రో లాంచ్.. ఫీచర్లకు ఫిదా అవ్వాల్సిందే..!

Honor 500 Pro launch in China Market: గ్లోబల్‌ మార్కెట్‌లో హానర్ మొబైళ్లు సందడి చేస్తున్నాయి. యూజర్ల అభిరుచికి తగ్గట్లుగా మోడరన్ స్టైల్, స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో వీటిని డిజైన్‌ చేస్తుండటంతో హానర్‌ క్రేజీ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. కొత్త ఆలోచనలు, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా న్యూ స్టాండర్డ్స్ సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా యువత నుంచి ప్రొఫెషనల్స్ వరకు విభిన్న వర్గాలను దృష్టిలో ఉంచుకుని, అందరికీ చేరువలో ఉండేలా డిజైన్, ఎక్స్పీరియన్స్, రెలియాల్ స్టెబిలిటీ అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. తాజాగా హానర్‌ నుంచి హానర్‌ 500 ప్రో విడుదలైంది. ఈ ఫోన్‌లో అత్యంత ఆకర్షణీయమైన అంశం డిజైన్. చేతిలో పట్టుకున్న వెంటనే ప్రీమియం ఫీల్ ఇస్తుంది. అక్వామెరైన్, స్టార్‌లైట్ పౌడర్, ఆబ్సిడియన్ బ్లాక్, మూన్‌లైట్ సిల్వర్ లాంటి నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. క్లాసీ లుక్ కోరుకునే వారికి ఇది పర్‌ఫెక్ట్ ఆన్సర్. వెనుక భాగం కర్వ్ ఫినిషింగ్‌తో స్మూత్‌గా ఉండటం, ఫ్రంట్‌లో బెజెల్స్ చాలా సన్నగా ఉండటం వలన స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ మరింత పెద్దదిగా అనిపిస్తుంది.

- Advertisement -

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్..

పర్ఫార్మెన్స్‌ విషయానికి వస్తే.. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను అందించింది. రోజూవారి యూసేజ్‌, హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్ అన్ని పరిస్థితుల్లో కూడా ఫోన్ స్ట్రక్‌ అవకుండా సాఫీగా నడుస్తుంది. 16 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ ఇవ్వడం వల్ల అప్లికేషన్స్, గేమ్స్, వీడియోస్, ఫైల్ స్టోరేజ్ అన్నీ టెన్షన్ లేకుండా పెట్టుకోవచ్చు. ఇందులో పనిచేసే మ్యాజిక్ ఓ‌ఎస్ 10, ఆండ్రాయిడ్ 16 ఆధారంగా ఉండటం వలన అనుభవం మరింత ఫాస్ట్‌గా అనిపిస్తుంది. దీన్ని ఐపి68, ఐపి69, ఐపి69కె ప్రొటెక్షన్‌తో తయారు చేశారు. ఇక, కెమెరా విషయానికి వస్తే.. హానర్ 500 ప్రోలో కెమెరా సెటప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వెనుక భాగంలో మొత్తం మూడు కెమెరాలు ఉన్నాయి. 200ఎంపి మెయిన్ వైడ్ లెన్స్, 50 ఎంపీ టెలిఫోటో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 12ఎంపి అల్ట్రావైడ్ మ్యాక్రో కెమెరాలున్నాయి. ఫోటోలు తీసినప్పుడు షార్ప్‌నెస్, కలర్ డీటైల్స్ చాలా క్లీన్‌గా కనిపిస్తాయి. దూరంలో ఉన్న వస్తువులను జూమ్ చేసినా క్వాలిటీ స్థిరంగా కొనసాగుతుంది. ముందు భాగంలో ఉన్న 50ఎంపి 3డి డెప్త్ సెన్సింగ్ కెమెరా వలన సెల్ఫీలు, పోర్ట్రెయిట్‌లు ప్రొఫెషనల్ కెమెరాతో తీసినట్టే కనిపిస్తాయి. ఇక, బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో పెట్టిన 8000mAh బ్యాటరీ ఒక మాటలో చెప్పాలంటే బీస్ట్. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే గంటలు గంటలు ఛార్జ్ గురించి ఆలోచించకుండా ఉపయోగించవచ్చు. 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఉండటం వలన తక్కువ టైమ్‌లోనే పూర్తి పవర్ పొందవచ్చు. 50W వైర్లెస్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్ కూడా ఉండటం వలన ఇతర డివైసెస్‌కు సులభంగా ఛార్జ్ చేయవచ్చు.

ఇండియాలో ధర ఎంతంటే?

చైనాలో 12జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ ధర 3,599 యువాన్ (భారత కరెన్సీలో సుమారుగా రూ.45 వేలు). 12 జీబీ ప్లస్ 512 జీబీ వేరియంట్ 3,899 యువాన్ (భారత కరెన్సీలో దాదాపు రూ.49 వేలు) ఉంటుంది. 16 జీబీ ప్లస్ 512 జీబీ ధర 4,199 యువాన్ (భారత కరెన్సీలో సుమారుగా రూ.53 వేలు) ఉంటుంది. ఇక 16 జీబీ ప్లస్ 1టీబీ హై-ఎండ్ వేరియంట్ 4,799 యువాన్ (భారత కరెన్సీలో రూ.60,000) వరకు ఉండే అవకాశం కనిపిస్తుంది. స్టాండర్డ్ హానర్ 500 ప్రారంభ ధర రూ. 2,699 యువాన్ (భారత కరెన్సీలో రూ.34,000) ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News