Honor Earbuds 4 Launched: చైనాకు చెందిన ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ హానర్ తన కస్టమర్ల కోసం సరికొత్త ఇయర్‌బడ్స్ ను తీసుకొచ్చింది. కంపెనీ వీటిని త్రూలి వైర్ లెస్ స్టీరియో (TWS) హెడ్‌ఫోన్స్ హానర్ ఇయర్‌బడ్స్ 4 పేరిట బుధవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ ఇయర్‌బడ్స్ హానర్ మ్యాజిక్ 8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు, హానర్ మ్యాజిక్‌ప్యాడ్ 3 సిరీస్ టాబ్లెట్‌లతో పాటు లాంచ్ అయ్యాయి. ఇవి ఇన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఈ ఇయర్‌బడ్స్ 50dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)కి మద్దతు ఇస్తాయి. ఛార్జింగ్ కేసుతో మొత్తం 46 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తున్న ఈ ఇయర్‌బడ్స్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
హానర్ ఇయర్‌బడ్స్ 4 ధర, లభ్యత:
కంపెనీ ఈ హానర్ ఇయర్‌బడ్స్ 4 ధర CNY 399 (సుమారు రూ. 5,000)గా పేర్కొంది..ఇక లాంచ్ ఆఫర్ కింద అక్టోబర్ 15 నుండి నవంబర్ 30 వరకు ప్రత్యేక ఆఫర్ లో CNY 349 (సుమారు రూ. 4,300)కి లభిస్తాయి. ఈ ఇయర్‌బడ్‌లు పెర్ల్సెంట్ వైట్, స్టార్రి స్కై బ్లాక్ రంగు ఎంపికలలో అందించారు. కస్టమర్లు ఈ ఈ ఇయర్ బడ్స్ ను అధికారిక హానర్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లతో సహా అధికారిక రిటైలర్‌ల నుండి వీటిని కొనుగోలు చేయవచ్చు.
also read:Winter Fruits: చలికాలంలో ఈ పండ్లు అస్సలు తినకూడదు..
హానర్ ఇయర్‌బడ్స్ 4 ఫీచర్లు:
హానర్ ఇయర్‌బడ్స్ 4 డ్యూయల్-టోన్ ఫినిషింగ్, టచ్ కంట్రోల్‌లతో వస్తాయి. వీటిలో 11mm, 6mm డ్యూయల్ మాగ్నెటిక్ సర్క్యూట్ టైటానియం-ప్లేటెడ్ డైనమిక్ డ్రైవర్‌లను అమర్చారు. ఇయర్‌బడ్స్ 50dB వరకు ANC మద్దతుతో డ్యూయల్ ట్రాన్స్‌పరెన్సీ మోడ్‌ను కలిగి ఉంటాయి. ఇవి ఇన్-ఇయర్ డిటెక్షన్ ఫీచర్‌లు, కాల్స్ సమయంలో 6m/s వరకు విండ్స్ నాయిస్ తగ్గించే AI-ఆధారిత మూడు-మైక్రోఫోన్ సిస్టమ్‌తో కూడా వస్తాయి. దీని రిస్పాన్స్ 20Hz – 20,000Hz వరకు ఉంది. ఇవి బ్లూటూత్ 5.3, డ్యూయల్-డివైస్ కనెక్టివిటీతో వస్తాయి.
ఫుల్ ఛార్జ్ తో ANC ఆఫ్‌తో 9 గంటలు, ANC ఆన్‌తో 5 గంటలు వాడుకకు వీలుగా ఉంటాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 46 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది. ఈ ఇయర్‌బడ్స్ ఒక 10 నిమిషాల ఛార్జ్ తో సుమారు 3 గంటల వినియోగాన్ని అందిస్తాయి. ప్రతి ఇయర్‌బడ్ 45mAh సెల్, ఛార్జింగ్ కేస్‌లో 500mAh బ్యాటరీ ఉంటుంది. USB టైప్-C పోర్ట్, ఛార్జింగ్ కేస్‌పై ఇండికేటర్ లైట్‌ను కలిగి ఉంటుంది. డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఇయర్‌బడ్‌లు IP54 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి.


