Tech News : టెక్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హానర్ (HONOR) సంస్థ, మిడ్-ప్రీమియం విభాగంలో మరో సంచలనానికి తెరలేపింది. మ్యాజిక్ 8 సిరీస్‌లో భాగంగా అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో HONOR Magic8 Liteను గ్లోబల్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. సాధారణంగా ‘లైట్’ వెర్షన్ అనగానే ఫీచర్లు తక్కువగా ఉంటాయని అందరూ అనుకుంటారు, కానీ హానర్ మాత్రం ఈ ఫోన్‌ను ఒక ‘ఫీచర్ పవర్‌హౌస్’లా తీర్చిదిద్దింది.
ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలైన డిస్‌ప్లే పగలడం, బ్యాటరీ త్వరగా అయిపోవడం, నీటి వల్ల ఫోన్ పాడవ్వడం వంటి అంశాలకు ఈ ఫోన్ శాశ్వత పరిష్కారాన్ని చూపుతోంది. 2.5 మీటర్ల ఎత్తు నుండి పడినా చెక్కుచెదరని ధృడత్వం, మూడు రోజుల పాటు నిరంతరంగా పనిచేసే భారీ బ్యాటరీ, నీటిలో మునిగినా ఏమీ కానటువంటి అత్యున్నత రక్షణ ప్రమాణాలతో (IP69K) ఈ ఫోన్ టెక్ ప్రియులను ఆశ్చర్యపరుస్తోంది. అత్యాధునిక AI ఫీచర్లు , అద్భుతమైన 108MP కెమెరాతో వస్తున్న ఈ ఫోన్, స్మార్ట్‌ఫోన్ మన్నిక (Durability) విషయంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తోంది.
Mexico : ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ మెక్సికో.. గ్రౌండ్ ఆపరేషన్ స్టార్ట్.!
హానర్ మ్యాజిక్ 8 లైట్.. ప్రధాన అంశాలు
ధృడత్వం (Durability):
- ఇది 2.5 మీటర్ల ఎత్తు నుండి కింద పడినా పగలదు (Drop Resistant).
- SGS ట్రిపుల్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్ పొందిన ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్.
- నీరు , దుమ్ము నుండి రక్షణ కోసం IP68, IP69K రేటింగ్స్ ఉన్నాయి. అంటే వేడి నీటి ప్రెషర్‌ను కూడా ఇది తట్టుకోగలదు.
డిస్‌ప్లే (Display):
- 6.79 అంగుళాల OLED డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్‌తో వస్తుంది.
- దీని పీక్ బ్రైట్‌నెస్ 6000 నిట్స్. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
- 120Hz రిఫ్రెష్ రేట్ , కంటి రక్షణ కోసం AI ఫీచర్లు ఉన్నాయి.
బ్యాటరీ (Battery):
- ఇందులో ఏకంగా 7500mAh భారీ బ్యాటరీ ఉంది.
- ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజుల వరకు బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది.
- 66W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది.
కెమెరా (Camera):
- వెనుక వైపు 108MP మెయిన్ కెమెరా (OIS సపోర్ట్‌తో) ఉంది.
- 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.
- నీటి అడుగున ఫోటోలు తీసుకునేందుకు (Underwater mode) ప్రత్యేక ఆప్షన్ ఉంది.
పనితీరు (Performance):
- Snapdragon 6 Gen 4 ప్రాసెసర్‌పై ఇది నడుస్తుంది.
- ఫోన్ వేడెక్కకుండా VC ఐస్ కూలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.
- ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత MagicOS 9.0 తో పనిచేస్తుంది.
మెమరీ & ధర:
- ప్రస్తుతానికి 8GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉంది.
- UK మార్కెట్‌లో దీని ధర సుమారు రూ. 42,500 (£399) గా ఉంది.
Team India : గంభీర్ రాడార్లో 4 కొత్త ప్లేయర్లు.. ఎవరో తెలుసా.?

