HONOR Magic8 Pro Air Ultra Slim SmartPhone Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ మరో స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌కు సిద్ధమవుతోంది. రియల్‌మీ, రెడ్‌మీ, వివో, శామ్‌సంగ్ వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లకు పోటీగా ఆకట్టుకునే ఫీచర్లతో మరో అల్ట్రా స్లిమ్ ఫోన్‌ను ఆవిష్కరించనుంది. గతేడాది మ్యాజిక్ 8 సిరీస్‌ను లాంచ్ చేసిన కంపెనీ.. ఇప్పుడు అదే సిరీస్‌లో భాగంగా హానర్ మ్యాజిక్ 8 ప్రో ఎయిర్‌ను జనవరి 19న చైనా మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. స్లిమ్, లైట్ వెయిట్ డిజైన్‌తో ఈ ఫోన్ కొత్త అనుభూతిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. హానర్ ప్రకారం, రాబోయే మ్యాజిక్ 8 ప్రో ఎయిర్ ఫోన్ లైట్ వెయిట్ ఉన్నప్పటికీ.. దీన్ని పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో డిజైన్ చేశారు. “మీకు కొత్త అనుభూతిని కొత్తగా అందిస్తుంది” అనే ట్యాగ్‌లైన్‌తో హానర్ సంస్థ ఈ ఫోన్‌ను ప్రమోట్ చేస్తోంది.
కేవలం 158 గ్రాముల బరువుతో..
హానర్ ప్రీ ఆర్డర్ పేజ్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ ఫోన్ బ్లాక్, వైట్, పర్పుల్, ఆరెంజ్ మొత్తం నాలుగు ఆకర్షణీయ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఇక, స్టోరేజ్ విషయంలో 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇంతకు ముందు విడుదలైన టీజర్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, కెమెరా మాడ్యూల్ కింద ఎల్‌ఈడీ ఫ్లాష్, మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ డిజైన్ వంటివి స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే లీక్‌లు, నివేదికల ప్రకారం.. ఈ ఫోన్ కేవలం 6.3 ఎంఎం మందం మాత్రమే ఉండనుంది. అంతేకాదు ఫోన్ బరువు కేవలం 158 గ్రాములు మాత్రమే కావడంతో ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అత్యంత అల్ట్రా లైట్ బాడీ ఫోన్‌గా నిలవనుంది. ఈ ఫోన్‌లో 1/1.3-ఇంచ్ ప్రో లెవల్ లార్జ్ సెన్సార్ మెయిన్ కెమెరా ఉండనున్నట్లు సమాచారం. ఫోటోగ్రఫీపై దృష్టి పెట్టే యూజర్లకు ఇది పెద్ద ప్లస్ పాయింట్‌గా మారనుంది. ఇప్పటివరకు డిజైన్, బేసిక్ స్పెసిఫికేషన్లపై మాత్రమే క్లారిటీ ఇచ్చింది. స్పెసిఫికేషన్స్, ధర, గ్లోబల్ లాంచ్ వంటి పూర్తి వివరాల కోసం జనవరి 19 వరకు వేచి చూడాల్సిందే.

