Honor Pad X7 Launched: హానర్ తమ వినియోగదారుల కోసం బడ్జెట్ ధరలో కొత్త టాబ్లెట్ ను మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ హానర్ ప్యాడ్ X7 పేరిట దీని తీసుకొచ్చింది. అయితే ఈ హానర్ ప్యాడ్ X7 సౌదీ అరేబియాలో లాంచ్ అయింది. హానర్ నుండి వచ్చిన ఈ కొత్త ఎంట్రీ-లెవల్ టాబ్లెట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌తో నడుస్తుంది. ఒక గ్రే కలర్ ఆప్షన్‌లో వస్తున్న హానర్ ప్యాడ్ X7 టాబ్లెట్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Honor Pad X7 ధర:
కంపెనీ హానర్ ప్యాడ్ X7 టాబ్లెట్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ సౌదీ అరేబియాలో SAR 349 (సుమారు రూ. 8,000)కు విడుదల చేసింది. అయితే, ఇది కేవలం పరిమిత కాల ఆఫర్ కింద లాంచ్ ప్రయోజనాలతో మాత్రమే వస్తుంది. ఆఫర్ ముగిసిన తర్వాత, దీని సాధారణ ధర SAR 449 (సుమారు రూ. 10,300)గా ఉంటుంది. ఇది ప్రస్తుతం సౌదీ అరేబియాలో గ్రే రంగు ఎంపికలో మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంది.
Honor Pad X7 ఫీచర్లు:
హానర్ ప్యాడ్ X7 టాబ్లెట్ 85 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో 8.7-అంగుళాల (800×1,340 పిక్సెల్స్) LCDని కలిగి ఉంది. 180ppi పిక్సెల్ సాంద్రత, 90Hz రిఫ్రెష్ రేట్, స్క్రీన్ గరిష్ట ప్రకాశం 625 నిట్‌లు అందించారు. దీని డిస్ప్లే TÜV రీన్‌ల్యాండ్ లో బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ సర్టిఫికేషన్‌ను పొందింది. ఈ టాబ్లెట్ 6nm స్నాప్‌డ్రాగన్ 680 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది అడ్రినో 610 GPU, 6GB వరకు RAMతో వస్తుంది. టాబ్లెట్ 128GB నిల్వను కలిగి ఉంది. దీనిని మైక్రో SD కార్డ్ సహాయంతో 1TB వరకు విస్తరించవచ్చు. కాగా ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 15 పై నడుస్తుంది
Also Read: Infinix Smart 10: AI ఫీచర్లతో Infinix Smart 10..ధర కేవలం రూ.6799..
ఇక కెమెరా గురించి మాట్లాడితే..ఇందులో వెనుక భాగంలో హానర్ ప్యాడ్ X7 f/2.0 అపెర్చర్, ఆటోఫోకస్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌ను ఉంది. ముందు భాగంలో f/2.2 అపెర్చర్, వీడియో కాలింగ్, సెల్ఫీల కోసం స్థిర ఫోకస్‌తో 5-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.
బ్యాటరీ విషయానికి వస్తే..ఇది 7,020mAh బ్యాటరీతో 10W ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కంపెనీ ప్రకారం..ఈ టాబ్లెట్ ఒకే ఛార్జ్‌పై 56 రోజుల వరకు స్టాండ్‌బై సమయాన్ని ఇవ్వగలదు. కనెక్టివిటీ పరంగా..బ్లూటూత్ 5.0, Wi-Fi 5 మద్దతును కలిగి ఉంది. ఇది ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. దీని కొలతలు 211.8×124.8×7.99mm. బరువు 365 గ్రాములు.


