Saturday, November 15, 2025
Homeటెక్నాలజీHonor Play 70 Plus: ఏఐ ఫీచర్లుతో హానర్ నుంచి నయా ఫోన్.. ధర, ఫీచర్ల...

Honor Play 70 Plus: ఏఐ ఫీచర్లుతో హానర్ నుంచి నయా ఫోన్.. ధర, ఫీచర్ల వివరాలివే!

Honor Play 70 Plus Launched: హానర్ నుంచి మరో కొత్త ఫోన్‌ విడుదల అయింది. కంపెనీ దీని హానర్ ప్లే 70 ప్లస్‌ పేరిట చైనా మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ పరికరాన్ని హానర్ ప్లే సిరీస్ కింద లాంచ్ చేశారు. కాగా, ఈ పరికరం నాలుగు రంగుల ఎంపికలలో వస్తుంది. ప్రత్యేకత ఏమిటంటే..? ఈ ఫోన్ లో 7,000mAh బిగ్ బ్యాటరీ, 45W ఛార్జింగ్ సపోర్ట్‌ను పొందొచ్చు. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి ధర, ఫీచర్ల వివరాల గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

- Advertisement -

Honor Play 70 Plus ధర:

కంపెనీ హానర్ ప్లే 70 ప్లస్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర CNY 1,399 అంటే దాదాపు రూ. 17,000గా, 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,599 అంటే దాదాపు రూ. 19,000గా పేర్కొంది. ఆగస్టు 8 నుంచి చైనాలో దీని సేల్ ప్రారంభం కానుంది.

Also Read: Vivo Y400 5G: 50MP కెమేరా, 6,000mAh బిగ్ బ్యాటరీతో వివో Y400 5G లాంచ్.. ధరెంతో తెలుసా..?

Honor Play 70 Plus ఫీచర్లు:

ఈ పరికరం 6.77-అంగుళాల HD + డిస్ప్లేను కలిగి ఉంది. అలాగే, సున్నితమైన స్క్రోల్ అనుభవం కోసం.. 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు కలిగి ఉంది. ఫోన్‌కు శక్తినివ్వడానికి ఈ పరికరం స్నాప్‌డ్రాగన్ 6s జనరేషన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఫోన్ అల్యూమినో సిలికేట్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను పొందుతోంది. ఓఎస్ విషయానికొస్తే..ఆండ్రాయిడ్ 15 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 9.0పై ఈ ఫోన్ నడుస్తుంది.

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం..ఫోన్‌లో f / 1.8 ఎపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరా ఉంది. ఇక సెల్ఫీల కోసం..ఈ పరికరం f / 2.2 ఎపర్చర్‌తో 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా AI ఎలిమినేట్, AI ఎక్స్‌పాండ్ ఇమేజ్‌తో సహా AI-ఆధారిత ఫీచర్లను కూడా అందిస్తుంది.

ఈ ఫోన్‌ను మరింత ప్రత్యేకంగా చేసేది దీని బ్యాటరీ. ఈ పరికరం 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh లి-అయాన్ పాలిమర్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ ఒకే ఛార్జ్‌పై 23 గంటల వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని, 12 గంటల వరకు వీడియో కాలింగ్ సమయాన్ని అందించగలదని కంపెనీ పేర్కొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad