Sunday, November 16, 2025
Homeటెక్నాలజీHonor X7c 5G: ఆగస్టు 18న మార్కెట్లోకి హానర్ నయా ఫోన్..ఫీచర్లు ఎలా ఉంటాయంటే..?

Honor X7c 5G: ఆగస్టు 18న మార్కెట్లోకి హానర్ నయా ఫోన్..ఫీచర్లు ఎలా ఉంటాయంటే..?

Honor X7c 5G Launch Date Fix: టెక్ ప్రియులకు గుడ్ న్యూస్. హానర్ నుంచి మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ రానున్నది. కంపెనీ దీని హానర్ X7c 5G పేరిట లాంచ్ చేయనున్నది. అయితే, ఇప్పటికే ఈ పరికరం పోయిన ఏడాది అక్టోబర్ లోనే ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో విడుదల అయింది. కాగా, ఈ పరికరం ఆగస్టు 18న భారతదేశంలో లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. హానర్ స్మార్ట్‌ఫోన్ ఇండియన్ వేరియంట్ దాని గ్లోబల్ వేరియంట్ మాదిరిగానే ఫీచర్లతో వస్తుందని తెలుస్తోంది. ఈ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్, 5,200mAh బిగ్ బ్యాటరీని కలిగి ఉంటుందని సమాచారం.

- Advertisement -

అజర్‌బైజాన్‌లో హానర్ X7c 5G పరికరం 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర AZN 359 (సుమారు రూ. 17,000)గా, 8GB+256GB RAM స్టోరేజ్ వేరియంట్ AZN 410 (సుమారు రూ. 20,200)గా ఉంది. అయితే ఇవే రేట్లు భారతదేశంలో కూడా ఉండొచ్చని సమాచారం.ఈ పరికరం ఆగస్టు 18న భారతదేశంలో లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ దేశంలో అమెజాన్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. ఇది ఫారెస్ట్ గ్రీన్, మూన్‌లైట్ వైట్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది.

ఇండియన్ హానర్ X7c 5G వేరియంట్ 120Hz రిఫ్రెష్ రేట్, 850 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవల్‌తో 6.8-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లేను కలిగి ఉందనున్నది. దీనికి డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉంటాయి. హ్యాండ్‌సెట్ దుమ్ము, స్ప్లాష్ నిరోధకత కోసం IP64 రేటింగ్‌ను పొందుతుంది. డ్రాప్ రెసిస్టెన్స్ కోసం SGS సర్టిఫికేషన్‌ను కూడా కలిగి ఉంటుంది.

Also Read: Alia Bhatt: అడల్ట్ మూవీకి గ్రీన్ సిగ్నల్..!

ప్రాసెసర్ కోసం.. ఈ స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 అందించనున్నారు. ఈ హ్యాండ్‌సెట్ 8GB RAM, 256GB UFS 3.1 ఆన్‌బోర్డ్ నిల్వను కలిగి ఉంటుంది. అదనంగా, 8GB వర్చువల్ RAMకి మద్దతు కూడా ఉంటుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 8.0తో వస్తుంది.

ఇక ఫోటోగ్రఫీ కోసం హానర్ X7c 5G 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంటుంది. ఫోన్ AI మోషన్ సెన్సార్‌తో సహా AI ఇమేజింగ్, ఎడిటింగ్ ఫీచర్‌లకు మద్దతు ఇస్తుంది. ముఖ్యంగా, గ్లోబల్ వేరియంట్‌లో 108-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉన్నాయి. బ్యాటరీ విషానికి వస్తే ఇది 35W హానర్ సూపర్‌ఛార్జ్ మద్దతుతో 5,200mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. గ్లోబల్ మోడల్‌లో 6,000mAh బ్యాటరీ కూడా ఉంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad