Honor X7c 5G Launched: హానర్ తమ వినియోగదారులకోసం మార్కెట్లో కొత్త పరికరాన్ని లాంచ్ చేసింది. కంపెనీ దీని హానర్ X7c 5G పేరిట తీసుకొచ్చింది. దీని తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన ఫీచర్స్ తో తీసుకురావడం విశేషం. హానర్ X7c 5G ఫోన్ లో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్, 50MP AI కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. రూ.15000 కంటే తక్కువ ధరకు కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి ఇది ఉత్తమ ఎంపిక. ఇప్పుడు ఈ పరికరానికి సంబంధించి ధర, లభ్యత, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Honor X7c 5G ధర:
కొనుగోలుదారులు హానర్ X7c 5G స్మార్ట్ ఫోన్ 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కు కొనుగోలు చేయొచ్చు. ఇదే సమయంలో 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999కు అందుబాటులో ఉంది. ఇక 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999కు సొంతం చేసుకోవచ్చు.
Honor X7c 5G లభ్యత:
ఈ ఫోన్ అమ్మకాలు ఆగస్టు 20 నుండి అమెజాన్ స్పెషల్స్‌లో ప్రారంభమవుతుంది. లాంచ్ ఆఫర్ కింద, కస్టమర్‌లు 6 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికను కూడా పొందొచ్చు.
Also Read:Lava Play Ultra 5G: గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్..లావా నుంచి సరికొత్త మొబైల్!
Honor X7c 5G ఫీచర్లు:
హానర్ X7c 5G 6.8-అంగుళాల FHD + LCD డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 850 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. బిగ్ డిస్ప్లేతో వస్తోన్న ఈ పరికరం ఎంతో మృదువైనదిగా ఉంటుంది. ఫలితంగా ఇది స్క్రోలింగ్, గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ అనుభవాన్ని గొప్పగా చేస్తుంది. ఇది దుమ్ము, నీటి స్ప్లాష్‌ల నిరోధకత కోసం IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 (4nm) ప్రాసెసర్ ను అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 9.0 ఆధారంగా మ్యాజిక్ ఓఎస్15 పై నడుస్తుంది.
ఈ ఫోన్ 8GB RAMని కలిగి ఉంది. దీనితో, 8GB వరకు వర్చువల్ RAM కూడా మద్దతు ఇస్తుంది. అంటే, ఈ ఫోన్ మొత్తం 16GB RAM లాగా పనిచేస్తుంది. నిల్వ కోసం.. ఇది 256GB అంతర్గత మెమరీని కలిగి ఉంది. కాబట్టి యాప్‌లు, గేమ్‌లు, మీడియా ఫైల్‌లను నిల్వ చేయడంలో ఎటువంటి సమస్య ఉండదు. ఆడియో అనుభూతి కోసం ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. ఇవి వాల్యూమ్‌ను 300% వరకు పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీనితో పాటు, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, NFC, AI నాయిస్ రిడక్షన్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఫోటోగ్రఫీ కోసం..ఇది 50MP ప్రైమరీ AI కెమెరాను కలిగి ఉంది. ఇది OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) కు మద్దతు ఇస్తుంది. దీనితో 2MP డెప్త్ సెన్సార్ కూడా అందించారు. ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా ఉంది.ఈ ఫోన్ 5200mAh బ్యాటరీతో 35W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతును కలిగి ఉంది. ఇది బ్యాటరీని త్వరగా ఛార్జ్ చేస్తుంది. ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత, ఈ ఫోన్ గేమింగ్, మల్టీమీడియా వాడకాన్ని ఎక్కువ కాలం నిర్వహించగలదని కంపెనీ పేర్కొంది.


