HP Hyperx Omen 15 Gaming Laptop Launched: హెచ్‌పి తన కస్టమర్ల కోసం భారత టెక్ మార్కెట్లో కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. హెచ్‌పి గేమింగ్ ల్యాప్‌టాప్‌లను హైపర్‌ఎక్స్ ఓమెన్ 15 సిరీస్ అని పిలుస్తారు. ఈ ల్యాప్‌టాప్‌లు ఇంటెల్ కోర్ i7-14650HX ప్రాసెసర్, NVIDIA GeForce RTX 50 సిరీస్ GPU ద్వారా శక్తిని పొందుతాయి. ఈ హెచ్‌పి గేమింగ్ ల్యాప్‌టాప్ సిరీస్ ను ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి అందుబాటులో ఉంది. ఇప్పుడు దీని ధర, లభ్యత, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
హెచ్‌పి హైపర్‌ఎక్స్ ఓమెన్ 15-ధర
హెచ్‌పి హైపర్‌ఎక్స్ ఒమెన్ 15 సిరీస్ ఇండియాలో రూ.1,49,999 ప్రారంభ ధరతో అధికారికంగా లాంచ్ అయింది. లాంచ్ ఆఫర్లలో భాగంగా కస్టమర్లు రూ.30,000 వరకు బోనస్ పొందవచ్చు. ఇక పాత ల్యాప్‌టాప్‌ను ఎక్స్చేంజ్ చేస్తే రూ.20,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. అదనంగా 18 నెలల నో-కాస్ట్ EMI సౌకర్యం కల్పించారు. ప్రత్యేక ఆఫర్‌గా HyperX CloudX Stinger 2 Core వైర్డ్ హెడ్‌సెట్‌ను కేవలం రూ.499కి, HyperX Knight బ్యాక్‌ప్యాక్‌ను రూ.999కే కొనుగోలు చేయవచ్చు.
హెచ్‌పి హైపర్‌ఎక్స్ ఓమెన్ 15- ఫీచర్లు
హెచ్‌పి హైపర్‌ఎక్స్ ఓమెన్ 15 గేమింగ్ సిరీస్ ల్యాప్‌టాప్‌లు అత్యాధునిక హార్డ్‌వేర్‌తో రూపొందించారు. ఇవి ఇంటెల్ కోర్ i7-14650HX ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతాయి. ఇది హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. గ్రాఫిక్స్ పనితీరును మరింత మెరుగుపరచడానికి NVIDIA GeForce RTX 50 సిరీస్ GPUని ఇందులో ఉపయోగించారు. మొత్తం గ్రాఫిక్స్ పవర్ 170W వరకు ఉండటంతో, హై-ఎండ్ గేమ్స్‌ను స్మూత్‌గా రన్ చేయగల సామర్థ్యం ఈ ల్యాప్‌టాప్‌కు ఉంది.
డిస్ప్లే విషయానికి వస్తే..హెచ్‌పి హైపర్‌ఎక్స్ ఓమెన్ 15లో 180Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన ప్రీమియం స్క్రీన్‌ను అందించారు. ఇది 500 నిట్స్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేయడం వల్ల ఇండోర్, అవుట్‌డోర్ వాడకంలో కూడా క్లియర్ విజువల్స్ అందిస్తాయి. గేమింగ్ రెస్పాన్సిబిలిటీ కోసం ఈ డిస్ప్లే 8K పోలింగ్ రేట్, కేవలం 0.125ms ప్రతిస్పందన సమయాన్ని కలిగి ఉంది. ఇది ప్రొఫెషనల్ గేమర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కూలింగ్ పరంగా..ఇందులో ఒమెన్ టెంపెస్ట్ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు. దీనితో పాటు సెల్ఫ్-క్లీనింగ్ ఫ్యాన్ టెక్నాలజీ ఉండటం వల్ల డస్ట్ సమస్య తగ్గి ల్యాప్‌టాప్ దీర్ఘకాలం మెరుగైన పనితీరును అందిస్తుంది. అదనంగా వన్-టచ్ ఒమెన్ ఏఐ ఫీచర్ ద్వారా సిస్టమ్ సెట్టింగ్‌లు ఆటోమేటిక్‌గా సర్దుబాటు అవుతూ గేమింగ్ అనుభూతిని మరింత మెరుగుపరుస్తాయి.

