Saturday, November 15, 2025
Homeటెక్నాలజీHuawei Mate 70 Air Launched: 6500mAh బ్యాటరీతో స్లిమ్ 5G ఫోన్‌ను విడుదల చేసిన...

Huawei Mate 70 Air Launched: 6500mAh బ్యాటరీతో స్లిమ్ 5G ఫోన్‌ను విడుదల చేసిన హువావే..

Huawei Mate 70 Air: హువావే చైనాలో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనికి హువావే మేట్ 70 ఎయిర్ పేరిట తీసుకొచ్చారు. ఈ ఫోన్ మందం కేవలం 6.6mm. ఇది అత్యంత సన్నని 5G ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో వస్తుంది. ఇది 16GB వరకు ర్యామ్, 512GB ఆన్‌బోర్డ్  స్టోరేజ్ ను అందిస్తుంది. ఇది ప్రస్తుతం మూడు కలర్ ఆప్షన్‌లలో నాలుగు ర్యామ్  స్టోరేజీ  వేరియంట్‌లలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ గురించి వివరంగా తెలుసుకుందాం.

ధర
హువావే మేట్ 70 ఎయిర్ విషయానికి వస్తే..ఇది12GBRAM+256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 4,199(సుమారు రూ. 52,000)గా, అలాగే 12GB + 512GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 4,699 (సుమారు ₹58,000)గా, 16GB+256GB స్టోరేజీ వేరియంట్ ధర CNY 4,699 (సుమారు ₹58,000)గా ఉంది. ఇక టాప్-ఆఫ్-ది-లైన్ 16GB + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 5,199 (సుమారు ₹65,000).
ఫీచర్లు
ఈ హువావే పరికరం అనేక ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుంది. ఇది 300Hz వరకు టచ్ శాంప్లింగ్ రేటుతో 7-అంగుళాల పూర్తి-HD+ అమోలేడ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 16GB వరకు ర్యామ్ తో Kirin 9020A చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. 12GB RAM మోడల్ Kirin 9020B చిప్‌సెట్, 512GB వరకు అంతర్గత నిల్వను కలిగి ఉంటుంది.
ఫోటోగ్రఫీ గురించి మాట్లాడితే..హువావే మేట్ 70 ఎయిర్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 12-మెగాపిక్సెల్ (f/2.4) టెలిఫోటో లెన్స్, 8-మెగాపిక్సెల్ (f/2.2) అల్ట్రావైడ్ లెన్స్, 1.5-మెగాపిక్సెల్ మల్టీ-స్పెక్ట్రల్ కలర్ కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీల కోసం..ఈ పరికరం 10.7-మెగాపిక్సెల్ (f/2.2) సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 4K రిజల్యూషన్ వరకు వీడియోలను రికార్డ్ చేయగలదు. ఏఐ డైనమిక్ ఫోటో, HDR, స్లో మోషన్, టైమ్-లాప్స్, స్మైల్ క్యాప్చర్, వాయిస్-యాక్టివేటెడ్ షూటింగ్ మోడ్‌లకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే..ఈ ఫోన్ 6,500mAh బ్యాటరీని 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ప్యాక్ చేస్తుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad